టాలీవుడ్ కు దాదాపు దూరమైన రకుల్ ప్రీత్ సింగ్ 

Rajeev 

Pic credit - Instagram

12 February 2026

 ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. చాలా మంది అభిమాన హీరోయిన్ ఈ భామ.

 తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటుంది. 

ఈ వయ్యారి భామ తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

 కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇటీవలే మేరీ హస్బెండ్ కి బీవీ , దేదే ప్యార్ దే 2 చిత్రంలో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది రకుల్. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. రీసెంట్ గా ఈ ముద్దగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.