ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 1 నుండి డ్రైవింగ్ లైసెన్స్ తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవు. వాహన యజమాని కూడా బాధ్యుడవుతారు. ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది. వెంటనే RTA ద్వారా స్లాట్ బుక్ చేసుకుని లైసెన్స్ పొందాలని పోలీసులు సూచిస్తున్నారు.
నగర రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల పట్ల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై ఇప్పటికే కొరడా ఝుళిపించిన పోలీసులు, ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు. మార్చి 1 నుంచి నగరం అంతటా నిరంతర ప్రత్యేక దాడులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ లేదా డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి. లేని పక్షంలో భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవు. మీ వాహనాన్ని లైసెన్స్ లేని వారికి ఇస్తే, వాహన యజమానిని కూడా బాధ్యుడిని చేస్తూ కేసులు నమోదు చేస్తారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురైతే, ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరిస్తాయి. దీనివల్ల వాహనం డ్యామేజ్ అయినా లేదా ఇతర నష్టాలు జరిగినా అన్నీ జేబు నుంచే చెల్లించుకోవాల్సి ఉంటుంది. లైసెన్స్ లేని వారు వెంటనే ఆర్టీఏ (RTA) కార్యాలయం ద్వారా స్లాట్ బుక్ చేసుకుని లైసెన్స్ పొందాలని పోలీసులు సూచిస్తున్నారు. గత 10 రోజులుగా రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు లైసెన్స్ తనిఖీలపై దృష్టి సారించారు. జేబు గుల్ల కాకుండా ఉండాలన్నా, చట్టపరమైన ఇబ్బందులు రాకూడదన్నా నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ విభాగం స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేబుల్ వైర్లు కాదు.. యమ పాశాలు.. నిర్లక్ష్యంపై ఆగ్రహం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

