తెలుగు తెరపై మరోసారి అందాల మ్యాజిక్.. మానస లుక్స్ వేరేలెవల్..
Rajitha Chanti
Pic credit - Instagram
11 February 2026
సోషల్ మీడియాలో ఇప్పుడు మానస వారణాసి స్పెషల్ అట్రాక్షన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన లేటేస్ట్ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
అటు ప్రమోషన్లతో భాగంగా క్రేజీ ఫోటోషూట్లతో సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు గ్రీన్ కలర్ ట్రెండీ సారీ అవుట్ ఫిట్ లో కనిపించింది మానస .
అందం , అభినయంతో అభిమానులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సింపుల్ స్మైల్ తో మనసుకు హత్తుకునేలా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ వయ్యారి.
యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ అమ్మడు నిత్యం ఏదోక క్రేజీ ఫోజులతో కట్టిపడేస్తుంది. తన డ్రెస్సింగ్ సెన్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది మానస.
ఇటీవల మానస మాట్లాడుతూ ప్రేమపై తన అభిప్రాయాన్ని భయటపెట్టింది. మనం మన ఇంట్లో మన కుటుంబసభ్యుల మధ్య ఎంత భద్రతగా ఫీల్ అవుతామని తెలిపింది.
అలాగే ప్రేమికుడి వద్ద కూడా అంతే భద్రతగా ఉండాలని.. అసలైన ప్రేమకు నిర్వచనం అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఈ బ్యూటీ తన మాటలతోనూ పాపులర్ అవుతుంది.
మానస వారణాసి వాస్తవానికి తెలంగాణకు చెందిన మోడల్. అలాగే ఆమె కోకోకోల మ్యూజిక్ హాల్ 2021 భారతదేశం తరఫున మిస్ వరల్డ్ పోటీలలో ప్రాతినిధ్యం వహించి పదవ స్థానంలో నిలిచింది.