అందం ఉన్న కలిసి రాని అదృష్టం.. నిధి పాపకు బ్రేక్ ఎప్పుడో.. 

Rajitha Chanti

Pic credit - Instagram

11 February 2026

టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 

రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నిధితోపాటు నభా నటేశ్ సైతం నటించగా.. వీరిద్దరికి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు అందుకుంది నిధి. నటనతో మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ బ్యూటీకి ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో బ్రేక్ మాత్రం రాలేదు. 

గతేడాది పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ కాంబోలో నటించిన హరి హర వీరమల్లు సినిమాలో పంచమి పాత్రలో అందంతోపాటు మంచి నటనతో మార్కులు కొట్టేసింది నిధి.

ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మారుతి దర్శకత్వంలో డార్లింగ్ నటించిన రాజా సాబ్ చిత్రంలో కథానాయికగా నటించి మరింత పాపులర్ అయ్యింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో మరోసారి నిధి ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.

మరోవైపు తెలుగులో నిధికి వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్, ట్రెడిషనల్ ఫోజులతో ఫోటోస్ షేర్ చేస్తుంది.

తాజాగా ఉల్లిపొర లాంటి పింక్ కలర్ చీర కట్టులో ఈమె తన అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.