AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఫ్రైడే ఓటీటీ మూవీస్.. స్ట్రీమింగ్ కు వచ్చిన కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవిగో.. ఆ రెండు చాలా స్పెషల్

ఈ వారంలో ఇప్పటికే మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు లాంటి పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇప్పుడు దీనిని కొనసాగిస్తూ శుక్రవారం (ఫిబ్రవరి 13)) కూడా పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.

OTT Movies: ఫ్రైడే ఓటీటీ మూవీస్.. స్ట్రీమింగ్ కు వచ్చిన కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవిగో.. ఆ రెండు చాలా స్పెషల్
OTT Movies
Basha Shek
|

Updated on: Feb 13, 2026 | 10:44 AM

Share

గత వారంతో పోల్చుకుంటే ఈ వారం థియేటర్లలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో విశ్వక్ సేన్ నటించిన ఫంకీ పై చాలా అంచనాలు ఉన్నాయి. అలాగే సంతోష్ శోభన్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ సినిమా కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. వీటితో పాటు అమరావతికి ఆహ్వానం, నీలవే వంటి తెలుగు సినిమాలు, సీతా పయనం వంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వారంలో థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు (జీ5 ఓటీటీ), అనగనగా ఒక రాజు (నెట్ ఫ్లిక్స్) తదితర సినిమాలు ఇప్పటికే ఓటీటీ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. ఇక ఈ శుక్రవారం (ఫిబ్రవరి 13) కూడా పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో తెలుగు సినిమాలు పెద్దగా లేకపోయినా పలు డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్‌ మూవీస్‌ ఓటీటీ ప్రియులను అలరించనున్నాయి. మరి ఈ శుక్రవారం ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో..

  • జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (ఇంగ్లిష్ సినిమా)
  • మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ వెబ్ సిరీస్)
  • ద ఆర్ట్ ఆఫ్ సారా (కొరియన్ వెబ్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇవి కూడా చదవండి
  • బ్యాండ్‌వాలే( హిందీ వెబ్ సిరీస్)
  • లవ్ మీ లవ్ మీ(హాలీవుడ్ మూవీ)

జియో హాట్‌స్టార్..

  • ద కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా)
  • భానుప్రియ భూతర్ హోటల్(బెంగాలీ హారర్‌ మూవీ)
  • ఉత్తర్(మరాఠీ సినిమా)

సన్ నెక్స్ట్

  • సూర్య: పవర్ ఆఫ్ లవ్ (కన్నడ సినిమా )
  • మాయబిమ్‌బుమ్(తమిళ సినిమా )

ఆపిల్ టీవీ ప్లస్

  • ఎటర్నటీ (ఇంగ్లిష్ సినిమా)

ది లయన్స్ గేట్ ప్లే..

  • ది రఫ్‌నెక్(హాలీవుడ్ థ్రిల్లర్‌ మూవీ)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.