Fat Problem: ఈ ఆహార పదార్థాలు తీసుకోండి చాలు.. కొవ్వు కరిగిపోతుంది..!

ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం(obesity). దీనికి ప్రధాన కారణం మన అలవాట్లు. జంక్ ఫుడ్( Food) వల్ల, పని ఒత్తిడి వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు చాలా మంది...

Fat Problem: ఈ ఆహార పదార్థాలు తీసుకోండి చాలు.. కొవ్వు కరిగిపోతుంది..!
Fats
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 02, 2022 | 9:42 AM

ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం(obesity). దీనికి ప్రధాన కారణం మన అలవాట్లు. జంక్ ఫుడ్( Food) వల్ల, పని ఒత్తిడి వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు చాలా మంది. దీన్ని తగ్గుంచుకోవడానికికొందరు జిమ్ బాట పడుతుంటే, మరికొందరు ఫుడ్ డైట్ ఫాలో అవుతున్నారు. అలా కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు కొవ్వు(Fat)ను కరిగించడంలోనూ, పెరగకుండా చేయడంలోనూ ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుందని నిపుణులు వివరిస్తున్నారు. పెరుగులో ప్రొటిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు కరగడంలో ఉపయోగపడతాయని చెబుతున్నారు. క్వినోవా ధాన్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని కూడా చెబుతున్నారు. ఇందులో పీచు పదార్థం, విటమిన్ ఈ, ఐరన్, జింక్ ఉంటుందని అంటున్నారు.

దాల్చిన చెక్కలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి ఉంది. దీని వల్ల ఆకలి తగ్గుతుంది. పుచ్చకాయ, కర్బూజా వంటి నీటి శాతం ఎక్కువగా పండ్లను తిసుకుంటే మంచిదట. వీటిలో ఉన్న ఫైబర్​ శరీరానికి అంది.. ఆకలి తగ్గుతుంది. పచ్చికూరగాయలు, ఆపిల్, టమాటొ వంటి పండ్లను సలాడ్​గా తినమని నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా బ్లాక్ టీ తీసుకునే వాళ్లు బరువు తగ్గిన దాఖలాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘టీ’లో ఒక రకమైన ఫ్లెమనాయిడ్స్ ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపర్చి, శరీర కొవ్వులను త్వరగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. అనేక ‘టీ’లలో ఉండే కెఫిన్.. శక్తి వినియోగాన్ని పెంచుతుంది. దీని వల్ల శరీరం మరిన్ని కేలరీలను కరిగిస్తుంది. అలాగే గ్రీన్ టీని వల్ల కూడా బరువు తగ్గవచ్చట.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Read also.. Health Tips: అలివ్‌ ఆయిల్‌లో వేయించిన వెల్లుల్లిని తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు