ఆరోగ్యమా.. అనారోగ్యమా.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగితే కలిగే ఫలితాలు ఇవే!

Samatha

13 February 2026

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చటి నీళ్లు తాగుతుంటారు.

వేడి నీళ్లు

రోజును సరైన విధంగా ప్రారంభించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలా జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి, పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.

జీర్ణ వ్యవస్థ

అంతే కాకుండా, ఎవరు అయితే గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఇది చాలా బెస్ట్, గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గొంతు నొప్పి

అలాగే ప్రతి రోజూ  గోరు వెచ్చటి నీళ్లు తాగడం వలన ఇది మూత్ర పిండాలు,  కాలేయ ఆరోగ్యానికి మద్ధతు ఇస్తుంది. శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపుతుంది.

కాలేయ ఆరోగ్యం

చర్మ ఆరోగ్యంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. గోరు వెచ్చటి నీళ్లు తాగడం వలన హైడ్రేట్‌గా ఉండి, చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

చర్మ ఆరోగ్యం

అలాగే గోరు వెచ్చటి నీరు శరీరంలోని చెడు కొవ్వును కరిగించి, బరువు నియంత్రణకు సహాయపడుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బరువు నియంత్రణ

ముఖ్యంగా ఇది పేగు కండరాలను సడలించి, పేగులకు రక్తప్రసరణను పెంచుతుంది. అలాగే మలబద్ధకం, ఉబ్బసం సమస్యలను తగ్గిస్తుంది కాబట్టి, ఇవి శరీరానికి చాలా మంచిది.

రక్తప్రసరణ

అయితే గోరు వెచ్చటి నీరు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, వీటిని అతిగా కాకుండా, ఒకటి నుంచి రెండు కప్పుల నీరు తీసకోవాలంట. అతి వేడి కాకుండా, గోరు వెచ్చటివి తీసుకోవడం మంచిది.

జాగ్రత్తలు