ముఖంపై ముడతలా.. ఈ పండ్లతో చెక్ పెట్టండి!

Samatha

13 February 2026

యవ్వనంగా కనిపించాలని ఎవరికి ఉండదు. చాలా మంది ఏజ్‌తో సంబంధం లేకుండా నిత్యం యవ్వనంగా కనిపించాలని కోరకుంటారు.

యవ్వనం

కానీ కొంత మంది ముఖంపై మడతల సమస్యతో ఇబ్బంది పడతారు, దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతారు, వారి కోసమే ఈ అదిరి పోయే సమాచారం, ఈ పండ్లతో ముఖంపై ముడతలకు చెక్ పెట్టండి.

పండ్లు

అవకాడో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి, చర్మం నిగారింపుగా ఉంటుంది.

అవకాడో

చర్మాన్ని నిగారింపులో టమాటాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖంపై ముడతలను తగ్గించి, శరీరానికి సహజ మెరుపును ఇస్తుంది.

టమాటాలు

బాదం పప్పులు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే.  అయితే ప్రతి రోజూ వీటిని డైట్‌లో చేర్చుకోవడం వలన ఇవి చర్మంపై ముడతలను తగ్గిస్తాయట.

బాదం 

ప్రతి రోజూ క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వలన ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై మడతలు, మచ్చలు తగ్గేలా చేసి, నిత్య యవ్వనంగా మార్చుతుంది.

గ్రీన్ టీ

సాల్మాన్ చాప ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని తీసుకోవడం వలన ఇది ముడతల్ని కంట్రోల్ చేస్తుంది.

సాల్మాన్

దానిమ్మ హిమోగ్లోబిన్ పెంచడమే కాకుండా, రక్తప్రసరణను మెరుగుపరుచి, శరీరానికి సహజ మెరుపును ఇస్తుంది. ముఖ్యంగా, దీనిలోని యాంటీ ఏజింగ్ గుణాలు, ముడతల సమస్యను తగ్గిస్తుంది.

ధానిమ్మ