AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: సర్కారు వారి పాట కోసం ఎదురుచూస్తున్నాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన కీర్తి సురేష్..

డైరెక్టర్ పరశురామ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో రాబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్

Keerthy Suresh: సర్కారు వారి పాట కోసం ఎదురుచూస్తున్నాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన కీర్తి సురేష్..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: May 02, 2022 | 8:02 AM

Share

డైరెక్టర్ పరశురామ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో రాబోతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియోస్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇందులో మహేష్ మరింత స్టైలీష్ లుక్‏లో కనిపించనుండడంతో సర్కారు వారి పాట చిత్రాన్ని చూసేందుకు మహేష్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కళావతి, పెన్నీ సాంగ్స్ రెండూ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. మిలియన్స్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ షేర్ చేస్తూ ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు మేకర్స్. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేశారు. ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. “సర్కారు వారి పాట సినిమాలో నా పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తిచేశాను. సూపర్ స్టార్ మహేష్ ను అందరిలా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆయన ఫ్యాన్స్ కు పక్కా ట్రీట్ ఉంటుంది. ” అని మెసేజ్‏తోపాటు..డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:  Sarkaru vaari paata: సూపర్‌ స్టార్‌ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. సర్కారు వారి పాట ట్రైలర్‌

వచ్చేస్తోంది..

AHA OTT: తెలుగు ఆడియన్స్‌ కోసం ఆహా మరో సర్‌ప్రైజ్‌.. నేషనల్‌ అవార్డు సినిమాను..

Viral Photo: అందాల సింధూరం.. మన తెలుగింటి ముద్ద మందారం.. ఎవరో గుర్తించారా..?

F3 Movie: ప్రేక్షకుల కోసం అదిరిపోయే సర్‌ప్రైజ్‌ సిద్ధం చేసిన ఎఫ్‌3 టీమ్‌.. పేలనున్న ఫన్‌ బాంబ్‌..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్