Viral Photo: బూరె బుగ్గల చబ్బీ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లోనే క్రేజీ హీరోయిన్..

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

Viral Photo: బూరె బుగ్గల చబ్బీ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లోనే క్రేజీ హీరోయిన్..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: May 02, 2022 | 1:03 PM

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన తారలను గుర్తించేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, నాని, రామ్ చరణ్, కాజల్, సమంత, తమన్నా వంటి స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. బూరె బుగ్గలతో చబ్బీ చబ్బీగా కనిపిస్తున్న క్యూట్ నెస్ ఓవర్ లోడ్ అయి ఉన్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. దక్షిణాదిలోనే క్రేజీ హీరోయిన్. ఇప్పటివరకు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టండి..

ఆ చిన్నారి మరెవరో కాదండి.. క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా.. ఉహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది… ఆ తర్వాత జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివమ్, సుప్రీమ్, హైపర్, జై లవకుశ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. అంతఃపురం మూవీతో మెప్పించింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్‏లో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. అలాగే ఓటీటీలోనూ రాణిస్తుంది. రుద్ర.. ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్, రాజ్ నిడమోర్ అండ్ కృష్ణ డికే వెబ్ సిరీస్ చేస్తుంది. వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇప్పుడు వెబ్‌సిరీస్‌లతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి థ్యాంక్యూ సినిమాలో స్క్రీన్ షేర్‌ చేసుకోనుంది. వీటితో పాటు సర్దార్‌ (తమిళం), యోధా(హిందీ), షైతాన్‌ కా బచ్చా(హిందీ) సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాలతార.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Actor Vijay Babu: అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తప్పుకున్న హీరో.. ఎందుకంటే..

Keerthy Suresh: సర్కారు వారి పాట కోసం ఎదురుచూస్తున్నాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన కీర్తి సురేష్..

RC 15: డైరెక్టర్ శంకర్ భారీ ప్లాన్.. చరణ్ సినిమాలో హైలేట్ అవే.. కొత్త షెడ్యూల్ అప్పుడే స్టార్ట్..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాలో మహేష్‏కు ఆ సాంగ్ ఇష్టం.. రచయత అనంత్ శ్రీరామ్..