Hyderabad: హైదరాబాద్ లో రేడియంట్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్
రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలక్ట్రానిక్స్ నూతన తయారీ కేంద్రాన్ని తెలంగాణ(Telangana) ఐటీ మంత్రి కేటీఆర్(KTR) ప్రారంభించారు. తెలంగాణాలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరంగా అత్యున్నత సంస్ధలలో ఒకటిగా రేడియంట్ కొనసాగుతుండటంతో...
రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలక్ట్రానిక్స్ నూతన తయారీ కేంద్రాన్ని తెలంగాణ(Telangana) ఐటీ మంత్రి కేటీఆర్(KTR) ప్రారంభించారు. తెలంగాణాలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరంగా అత్యున్నత సంస్ధలలో ఒకటిగా రేడియంట్ కొనసాగుతుండటంతో పాటు.. ఎలక్ట్రానిక్స్ తయారీలో అగ్రగామి సంస్థలలో ఒకటిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. స్వల్ప కాలంలోనే 5 మిలియన్ ఎల్‌ఈడీ టీవీల ఉత్పత్తిని సాధించిన రేడియంట్ టీమ్‌ను అభినందించారు. నూతన సామర్ధ్య విస్తరణతో రేడియంట్ మరిన్ని మైలురాళ్లను అందుకోగలదని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్(Hyderabad) లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను రూ.100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేశారు. దీని ద్వారా అదనంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన రేడియంట్ అప్లయన్సెస్.. నాణ్యత తయారీ ప్రక్రియ, సుశిక్షితులైన ఉద్యోగులతో రెండు సంవత్సరాలలో 5 మిలియన్లకు పైగా ఎల్‌ఈడీ టీవీలను ఉత్పత్తి చేసింది. కరోనా విజృంభించిన పరిస్థితుల్లోనూ ఉత్పత్తి ఆపకుండా ఈ ఘనత సాధించడం గమనార్హం.
భారతదేశంలో ఎల్‌ఈడీ టీవీ తయారీ పరంగా అతిపెద్ద ఓఈఎంలలో ఒకటైన స్కైవర్త్‌తో రేడియంట్ అప్లయెన్సస్ అండ్ ఎలక్ట్రానిక్స్ – హైదరాబాద్ ఒప్పదం చేసుకుంది. ఎలక్ట్రానిక్స్ స్థానిక తయారీని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ఐటీ, వాణిజ్య ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేడియంట్ పరిశ్రమ అనుకూల వాతావరణంతో పాటు, ప్రభుత్వ మద్దతు, ప్రోత్సాహం వంటివి తమ విజయానికి తోడ్పాటు అందించాయని రేడియంట్ అప్లయెన్సస్ డైరెక్టర్ శ్రీ మణికందన్ నరసింహన్ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Big News Big Debate: దాడిపై స్పందించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్