AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: స్నానం చేసిన తరువాత ఈ 8 పనులు అస్సలు చేయొద్దు.. లేదంటే భారీ నష్టం తప్పదు..!

Astro Tips: చాలా మంది ప్రజలు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు. ప్రతి రోజూ క్లీన్ చేస్తుంటారు. అయితే, కొంత మంది మాత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ..

Astro Tips: స్నానం చేసిన తరువాత ఈ 8 పనులు అస్సలు చేయొద్దు.. లేదంటే భారీ నష్టం తప్పదు..!
Vastu Tips
Shiva Prajapati
|

Updated on: May 02, 2022 | 5:39 PM

Share

Astro Tips: చాలా మంది ప్రజలు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు. ప్రతి రోజూ క్లీన్ చేస్తుంటారు. అయితే, కొంత మంది మాత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ.. ఇంట్లోని బాత్రూమ్‌ను నిర్లక్ష్యంగా వదిలేస్తారు. అక్కడి పరిశుభ్రత గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే, వాస్తు ప్రకారం బాత్రూమ్ ఎక్కువ ప్రతికూలతను కలిగిస్తుందని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. బాత్రూమ్ విషయంలో చేసే కొన్ని పొరపాట్లు ఆర్ధిక నష్టాలు, వృద్ధికి ఆటంకాలు కలిగిస్తాయి. కావున.. బాత్రూమ్ విషయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. స్నానం చేసిన తర్వాత బకెట్‌లో నీళ్లు వదలకూడదు. ఆ మిగిలిన నీటితో ఎవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. నీటిని వదిలిన వ్యక్తిని కూడా బాధపెడుతుంది. 2. స్నానం చేసిన తర్వాత బకెట్ ఖాళీగా ఉంచవద్దు. వాస్తు ప్రకారం, బకెట్‌ను మంచి నీటితో నింపాలి. ఒకవేళ నీరు నింపకుండా ఉంటే.. దానిని బోర్లా పెట్టాలి. దీని వల్ల వాస్తు దోషాల సమస్య ఉండదు. 3. తలస్నానం చేసిన వెంటనే జుట్టు తడిగా ఉంటే వివాహిత స్త్రీలు కుంకుమ పెట్టుకోకూడదు. ఇది వారిపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు వారి మనసులో ప్రతికూల ఆలోచనలు కలిగిస్తాయి. 4. స్నానం చేసిన వెంటనే పదునైన వస్తువులను ఉపయోగించవద్దు. స్నానానికి ముందు నెయిల్ కట్టర్ ఉపయోగించవచ్చు. 5. స్నానం చేసిన వెంటనే అగ్నిని తాకవద్దు. మొదట, ఏదైనా తిని, ఆ తరువాత వంటగదికి వెళ్లాలి. 6. స్నానం చేసిన వెంటనే మేకప్ వేసుకోవద్దు. మీ జుట్టు తడిగా ఉంటే మేకప్ అస్సలు చేసుకోవద్దు. ఇది మీ జీవితంపై ప్రతికూల శక్తిని పెంచుతుంది. 7. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్‌ను క్లీన్ చేయండి. స్నానాల గదిని అపరిశుభ్రంగా ఉంచొద్దు. స్నానం చేసిన తరువాత బాత్రూమ్‌ని శుభ్రంగా ఉంచకపోతే రాహు, కేతు, శని గ్రహాలు ఆగ్రహానికి గురవుతాయి. దీని వల్ల ఈ మూడు గ్రహాల దుష్ఫలితాలు వేగంగా చూపుతాయి. ఫలితంగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడుతుంది. 8. బాత్రూమ్‌లో తడి బట్టలు అస్సలు విడిచి పెట్టొద్దు. వాస్తు ప్రకారం చేయడం వలన ఇంట్లోని వ్యక్తులై సూర్యుడి ప్రభావం బలహీనపడుతుంది. దాంతో వ్యక్తికి గౌరవం తగ్గుతుంది. అలాగే ధననష్టంతో పాటు అనేక కష్టాలు పడాల్సి వస్తుంది.

(గమనిక: ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని వాస్తుశాస్త్రం, మత గ్రంధాల ఆధారంగా దీనిని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.)

Also read:

Janasena: జనసేన రైతు భరోసా యాత్ర.. ఈ నెల 8న కర్నూలు జిల్లాలో పవన్ పర్యటన

Viral Photo: ఈ ఫోటోలోని తప్పును కనిపెడితే మీరు జీనియస్! అంత ఈజీ కాదండోయ్..

Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. వేసవి సెలవుల్లో తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..