Horoscope Today: వీరు ఈ రోజు శుభవార్త వింటారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: H కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అంతెందుకు రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు...

Horoscope Today: వీరు ఈ రోజు శుభవార్త వింటారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 03, 2022 | 5:44 AM

Horoscope Today: కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా కొందరు తమ జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అంతెందుకు రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి మే 3వ తేదీ మంగళవారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం

ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికి పట్టుదలతో పూర్తిచేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.

వృషభం

సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగ్గ ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి.

మిథునం

ముఖ్య విషయాల్లో మనోబలం అవసరం. బద్ధకాన్ని దరిచేరనీయకండి. బంధువుల సహకారం అందుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. చంద్రధ్యానం శుభప్రదం.

కర్కాటకం

చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. మీ మీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

సింహం

విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు

కన్య

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కలహ సూచన ఉంది. అనవసర ప్రసంగాలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.

తుల

ఈరోజు మీ సమయాన్ని, శక్తిని అనుత్పాదక కార్యకలాపాలలో వృధా చేయవద్దు. మీ నిర్ణయాలపై తగిన శ్రద్ధ వహించండి. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, కొంత సమాచారంతో సలహా తీసుకోవడం మంచిది.

వృశ్చికం

వ్యాపారవేత్తలు భాగస్వామ్యం లేదా సంఘం ద్వారా మంచి లాభం పొందవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ,వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి.  ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.

ధనుస్సు

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. పెండింగ్‌లో ఉన్న ఆస్తి ఒప్పందం ఇప్పుడు లాభదాయకంగా ఉంటుంది.

మకరం

ఈ రోజు ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రోజు మీరు ప్రేమ వ్యవహారాల పరంగా అదృష్టవంతులుగా ఉంటారు. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.

కుంభం

మీరు కలత చెందుతున్నారని ఎవరికీ తెలియకుండా ఉండడం మంచిది. మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని మంచి అవకాశాలను కూడా పొందవచ్చు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శనిజపం చేసుకోవాలి.

మీనం

స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. వారాంతంలో మేలు జరుగుతుంది. లక్ష్మీదేవి నామాన్ని స్మరించాలి.

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..