Janasena: జనసేన రైతు భరోసా యాత్ర.. ఈ నెల 8న కర్నూలు జిల్లాలో పవన్ పర్యటన
ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి కర్నూలు(Kurnool) జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వెల్లడించారు. శిరివెళ్ల(Sirivella) మండలం కేంద్రంలో...
ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి కర్నూలు(Kurnool) జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వెల్లడించారు. శిరివెళ్ల(Sirivella) మండలం కేంద్రంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి.. ఆత్మహత్య చేసుకున్న130 మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి రూ.7 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కర్నూలు జిల్లాలోనేనన్న మనోహర్.. సుమారు 373 మంది కౌలు రైతులు గత మూడేళ్లలో బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందలేదని మండిపడ్డారు. అందుకే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 8వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్నారని వివరించారు.
తొలి విడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ సాయం చేస్తారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తారు. రెండో విడతలో మిగిలిన వారికి సాయం అందిస్తాం. కౌలు రైతులకు ఆర్థికంగా సాయపడే ఈ గొప్ప కార్యక్రమం గురించి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ప్రతి రైతుకీ తెలియజేయాలి. వారికి మనం చేస్తున్న సాయం గురించి వివరించండి. రైతులకు తన వంతు సాయం చేస్తున్న పవన్ కల్యాణ్ గొప్ప ఆలోచనను ప్రజలకు చెప్పాలి.
– నాదెండ్ల మనోహర్, జనసేన నేత
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ మంత్రులు, నేతలు చేస్తున్న చౌకబారు విమర్శలు మానుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలను విమర్శించే పని మానుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. రైతు భరోసా యాత్ర రైతులకు కొండంత నమ్మకాన్ని కలిగిస్తున్న విషయాన్ని గ్రహించి.. వైసీపీ నేతలు ఇలాంటి విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. రైతు భరోసా యాత్ర మొదలు పెట్టగానే అదరాబాదరాగా రైతు కుటుంబాల ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వారికి రూ.7 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Also Read
Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. వేసవి సెలవుల్లో తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు
PM KISAN Samman Nidhi Yojana: రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు.. ఎప్పుడు అంటే..?