Andhra Pradesh: ఏపీలో ఆగని “పది” పరీక్షపత్రాల లీకులు.. ఆలూరులో మ్యాథ్స్ పేపర్, డోకిపర్రులో సెల్ ఫోన్ లో ఆన్సర్స్
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పదో తరగతి పరీక్షాపత్రాల లీకేజీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే పేపర్ లీక్ అవుతున్నాయి. రోజుకో ప్రాంతంలో ప్రశ్నపత్రం లీకేజీ వార్తలు వస్తూనే ఉన్నాయి...

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పదో తరగతి పరీక్షాపత్రాల లీకేజీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు నుంచే పేపర్ లీక్ అవుతున్నాయి. రోజుకో ప్రాంతంలో ప్రశ్నపత్రం లీకేజీ వార్తలు వస్తూనే ఉన్నాయి. కరోనా(Corona) కారణంగా ఇప్పటికే విద్యార్థుల విలువైన సమయం వృథా అయింది. తాజాగా ప్రశ్నపత్రాల లీక్వ్యవహారం విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కలుగిస్తోంది. నంద్యాల, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో జరిగిన పేపర్(Tenth paper leak) లీకేజీ ఘటనలను మరవకముందే మరోసారి కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లాల్లో పేపర్ లీక్ ఘటనలు సంచలనంగా మారాయి. కర్నూలు జిల్లా ఆలూరులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపింది. సోమవారం మ్యాథ్స్ పేపర్ సెల్ ఫోన్ లో ప్రత్యక్షమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పేపర్ లీక్ అవడంతో జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. పరీక్ష కేంద్రం వద్ద ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో తామే స్వయంగా పరీక్ష పత్రాల ఫొటోలు తీసుకొచ్చినట్లు యువకులు అంగీకరించారు. పరీక్ష జరుగుతుండగా ఓ యువకుడు అతని స్నేహితులకు కాపీ చిట్టీలు వేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై యువకుడిని గుర్తించి పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసి పరిశీలించగా ప్రశ్నాపత్రం కనిపించింది. ఎస్సై ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్పీ.. ఎవరెవరి హస్తం ఉందన్న దానిపై విచారణ చేపట్టారు.
మరో ఘటనలో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. సమాధానాల చిట్టీలను ఎగ్జామ్ సెంటర్ కు పంపుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. సమాచారం అందుకున్న విద్యాశాఖ, పోలీస్ అధికారులు పాఠశాలకు చేరుకున్నారు. కొందరు ఉపాధ్యాయుల వద్ద సెల్ఫోన్లో సమాధానాలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Also Read
Astro Tips: స్నానం చేసిన తరువాత ఈ 8 పనులు అస్సలు చేయొద్దు.. లేదంటే భారీ నష్టం తప్పదు..!
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ వచ్చేసింది.. ఇరగదీసిన మహేష్ బాబు