Andhra Pradesh: ఏపీలో ఎలక్షన్‌ హీట్‌ స్టార్ట్‌.. చంద్రబాబు జిల్లాల టూర్‌కు కారణం అదేనా..?

Andhra Pradesh: ఏపీలో ఎలక్షన్‌ హీట్‌ స్టార్ట్‌ అయ్యిందా? చంద్రబాబు ముందుగానే మేల్కొని జనం బాట పడుతున్నారా? బాబు జిల్లాల టూర్‌కు కారణం ఏంటీ? ప్రత్యేక కథనం మీకోసం..

Andhra Pradesh: ఏపీలో ఎలక్షన్‌ హీట్‌ స్టార్ట్‌.. చంద్రబాబు జిల్లాల టూర్‌కు కారణం అదేనా..?
Chandrababu Naidu(File Photo)
Follow us
Shiva Prajapati

|

Updated on: May 03, 2022 | 7:15 AM

Andhra Pradesh: ఏపీలో ఎలక్షన్‌ హీట్‌ స్టార్ట్‌ అయ్యిందా? చంద్రబాబు ముందుగానే మేల్కొని జనం బాట పడుతున్నారా? బాబు జిల్లాల టూర్‌కు కారణం ఏంటీ? ప్రత్యేక కథనం మీకోసం.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రేపట్నుంచి చంద్రబాబు పర్యటన ప్రారంభం కానుంది. బాబు పర్యటనల షెడ్యూల్‌ను విడుదల చేసింది టీడీపీ. ఇటీవల నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసనల్లో భాగంగా, రేపు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చేపట్టే కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు. 5న తేదీ భీమిలి నియోజవర్గం తాళ్లవలసలో, 6న ముమ్మడివరం నియోజవర్గం కోరింగ గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో ఈ పర్యటనలు ఉండేలా టీడీపీ ప్రణాళిక సిద్దం చేసింది. మహానాడు వరకు పలు జిల్లాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. అంతేకాదు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా చంద్రబాబు పర్యటన ఉండనుందని తెలుస్తోంది.

చంద్రబాబు పుట్టినరోజు ఏప్రిల్ 20 నుంచే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెంలో పర్యటించారు. అక్కడ స్థానిక ప్రజలతో సమావేశం అయ్యారు చంద్రబాబు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు ఉంటాయని అప్పుడే సంకేతాలు పంపారు. రోడ్‍షోలు, బహిరంగ సభలతో సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు ప్రతిపక్ష నేత. బాబు పర్యటనలతో కేడర్‌లో కూడా జోష్‌ పెరుగుతుందని ఆశలో ఉన్నారు నేతలు. అందుకే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బాబు టూర్‌ ఉండేలా పక్కాగా ప్లాన్‌ చేశారు. 151 స్థానాల్లో గెలుపొందిన వైసీపీని ఎదుర్కోవాలంటే, ఎక్కవ కాలం జనాల్లో ఉండాలని నేతలు చంద్రబాబుతో అన్నట్టు తెలుస్తోంది. చాలామంది నాయకుల అభిప్రాయం తర్వాతే చంద్రబాబు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.

Also read:

Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనలో కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ..? సెంటిమెంట్‌తోనే చెక్ పెట్టేందుకు..!

Lord Shiva Worship: సోమవారం నాడు శివుడికి ఇవి సమర్పించండి.. కోరిన కోరికలు నెరవేరుతాయట..!

Viral Video: తొలిసారి బాదంపప్పు టేస్ట్ చేసిన ఉడత.. దాని రియాక్షన్ అస్సలు ఊహించలేరు..!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!