Viral Video: బీచ్‌లో సేదతీరుతున్న వ్యక్తికి చుక్కలు చూపించిన సీ లయన్.. సీట్ నుంచి లేపి మరీ..!
Viral Video: బీచ్‌లో కాసేపు రిలాక్స్ అవుదామనుకున్న వ్యక్తికి చుక్కలు చూపించింది ఓ సీ లయన్. ఓ బీచ్‌సైడ్ రిసార్ట్‌లో ఓ వ్యక్తి సేదతీరుతున్నాడు. ఓ విలాసవంతమైన కుర్చీలో పడుకుని
Viral Video: బీచ్‌లో కాసేపు రిలాక్స్ అవుదామనుకున్న వ్యక్తికి చుక్కలు చూపించింది ఓ సీ లయన్. ఓ బీచ్‌సైడ్ రిసార్ట్‌లో ఓ వ్యక్తి సేదతీరుతున్నాడు. ఓ విలాసవంతమైన కుర్చీలో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో సముద్రంలోంచి ఈదుకుంటూ ఓ సీ లయన్ అక్కడికి వచ్చింది. నేరుగా ఆ వ్యక్తి కూర్చున్న కుర్చీ వద్దకు వెళ్లింది. దాన్ని తరిమివేయడానికి ఆ వ్యక్తి ప్రయత్నించినా ఏమాత్రం బెదరకుండా అతను కూర్చున్న కుర్చీపైకి ఎక్కి దర్జాగా పడుకుంది. చేసది లేక ఆ వ్యక్తి చైర్ పై వేసుకున్న తన బెడ్ షీట్ తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వేలమంది లైక్ చేస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
Also read:
Lord Shiva Worship: సోమవారం నాడు శివుడికి ఇవి సమర్పించండి.. కోరిన కోరికలు నెరవేరుతాయట..!
Viral Video: తొలిసారి బాదంపప్పు టేస్ట్ చేసిన ఉడత.. దాని రియాక్షన్ అస్సలు ఊహించలేరు..!