Largest Bottle: బాహుబలి విస్కీ బాటిల్‌.. అందులో ఎంత మద్యం పడుతుందో తెలిస్తే ఫ్యూజుల్ ఔట్..!

Largest Bottle: త్వరలోనే బాహుబలి స్కాచ్‌ విస్కీ బాటిల్‌ వేలానికి రాబోతోంది. ప్రపంచంలోని భారీ విస్కీ బాటిల్‌ ది ఇంట్రెపిడ్‌.. ఎత్తు ఐదు అడుగుల 11 అంగుళాలు. అంటే సగటు మనిషి ఎత్తు

Largest Bottle: బాహుబలి విస్కీ బాటిల్‌.. అందులో ఎంత మద్యం పడుతుందో తెలిస్తే ఫ్యూజుల్ ఔట్..!
Wine Bottle
Follow us
Shiva Prajapati

|

Updated on: May 03, 2022 | 8:20 AM

Largest Bottle: త్వరలోనే బాహుబలి స్కాచ్‌ విస్కీ బాటిల్‌ వేలానికి రాబోతోంది. ప్రపంచంలోని భారీ విస్కీ బాటిల్‌ ది ఇంట్రెపిడ్‌.. ఎత్తు ఐదు అడుగుల 11 అంగుళాలు. అంటే సగటు మనిషి ఎత్తు కంటే ఎక్కువే! స్కాట్‌ల్యాండ్‌కు చెందిన మాకల్లన్‌ కంపెనీ 32 సంవత్సరాల క్రితం ఈ భారీ స్కాచ్‌ విస్కీ బాటిల్‌ను తయారు చేసింది. 311 లీటర్ల సామర్థ్యం ఉన్న “ఇంట్రెపిడ్‌” వేలం పాటను మే 25న ఆక్షన్‌ హౌజ్‌.. లయాన్‌ అండ్‌ టర్న్‌బుల్‌ నిర్వహించనుంది. గతంలో ఓ విస్కీబాటిల్‌ అత్యధికంగా 1.9 మిలియన్‌ డాలర్లు అంటే పద్నాలుగున్నర కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ రికార్డును ది ఇంట్రెపిడ్‌ బద్ధలు కొట్టనుంది.

కిందటి ఏడాది గిన్నిస్‌ బుక్‌లో ఇంట్రెపిడ్‌కు చోటు దక్కింది. ఇప్పుడు వేలం ద్వారా మరో రికార్డుకు సిద్ధం అవుతున్నారు. వేలంపాటలో ప్రారంభ ధరనే 1.3 మిలియన్‌ పౌండ్లుగా అనుకుంటున్నారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయం మొత్తంలో.. 25 శాతాన్ని మేరీ క్యూరీ చారిటీకి ఇవ్వాలని భావిస్తున్నారు. నిజానికి ఈ బాటిల్‌ను రికార్డుల కోసం పదిలపర్చాలని సదరు కంపెనీ అనుకుంది. కానీ, ఒక మంచి పనికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు వేలానికి ముందుకు వచ్చింది.

Also read:

Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనలో కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ..? సెంటిమెంట్‌తోనే చెక్ పెట్టేందుకు..!

Lord Shiva Worship: సోమవారం నాడు శివుడికి ఇవి సమర్పించండి.. కోరిన కోరికలు నెరవేరుతాయట..!

Viral Video: తొలిసారి బాదంపప్పు టేస్ట్ చేసిన ఉడత.. దాని రియాక్షన్ అస్సలు ఊహించలేరు..!