Visakhapatnam: మొదలైన చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
Visakhapatnam: విశాఖపట్నం సమీపంలోని సింహాచలం(Simhachalam) క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి(Sri Varaha Lakshami Narasimha Swamy) నిజరూప దర్శనం మొదలైంది..
Visakhapatnam: విశాఖపట్నం సమీపంలోని సింహాచలం(Simhachalam) క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి(Sri Varaha Lakshami Narasimha Swamy) నిజరూప దర్శనం మొదలైంది. మరోవైపు సింహగిరిపై ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు అప్పన్న నిజ రూప దర్శనం కోసం భారీగా బారులు తీరిన భక్తులు. భారీ వర్షంలో తడిసి ముద్దవుతోన్న అప్పన్న చ౦దనోత్సవానికి భక్తులు వచ్చారు. అప్పన్న ఆలయ అనువ౦శక ధర్మ కర్త అశోక్ గజపతిరాజు, అతని కుటుంభ సభ్యులు ఆనందగజపతి రాజు భార్య సుధా గజపతి,ఆమె కుమార్తె ఊర్మిళ గజపతి సహా చందనం సమర్పించి తొలి దర్శనాన్ని చేసుకున్నారు. స్వామివారి నిజరూప దర్శనాన్ని మరికొందరు మంత్రులు దర్శనం చేసుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న స్పీకర్ తమ్మినేని, మంత్రులు అమర్నాథ్, చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ, కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి, అవ౦తి.. నిజరూప దర్శనం చేసుకున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతా రెడ్డి తదితరులు.
తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులకు అప్పన్న సర్వదర్శనం ప్రారంభమైంది. సింహగిరిపై చందనోత్సవంకు భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. భారీ వర్షంలో తడుస్తూనే స్వామి వారి దర్శనం కోసం భక్తుల నిరీక్షిస్తున్నారు. గర్భాలయం వద్ద కలెక్టర్ మల్లికార్జున క్యూలైన్లను పరిశీలిస్తూ భక్తులను లోపలోకి పంపుతున్నారు. నేడు సాయంత్రం వరకు అప్పన్నన్ని సుమారు రెండు లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వయంగా భద్రత ఏర్పాట్లను పోలీస్ కమీషనర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
వరాహ నరసింహ స్వామి వారు ఏడాదిలో 364 రోజులు చందనంతో కప్పబడి దర్శనమిస్తారు. చందనంతో కప్పబడి ఉన్న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వైశాఖ శుద్ధ తదియ రోజున భక్తులకు నిజరూప దర్శనం ఇస్తాడు. ఈ ఒక్కరోజు మాత్రమే చందనం తొలగించబడి నిజ రూపం దర్శనమిస్తారు. మానవుడు కూడా రెండు రూపాలు కలిగి ఉంటాడు. ఒకటి బాహ్య రూపం, రెండవది అంతర్గత రూపం. అంతర్గతంగా ఉన్న ఆత్మ రూపాన్ని దర్శించడమే నిజం రూప దర్శనమని భక్తుల నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: నేడు అక్షయ తృతీయ సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు