Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజున ఈ దోషం ఉన్నవారు పెళ్లి చేసుకోవడం శుభప్రదం.. ఎందుకంటే..
Akshaya Tritiya for Marriage: హిందూమతంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది (Akshaya Tritiya 2022). కొంతమంది ఈరోజున లక్ష్మీదేవిని(Lakshami Devi) పూజ చేయడం చాలా పవిత్రమైనదిగా..
Akshaya Tritiya for Marriage: హిందూమతంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది (Akshaya Tritiya 2022). కొంతమంది ఈరోజున లక్ష్మీదేవిని(Lakshami Devi) పూజ చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మరికొందరు ఈరోజు శుభకార్యాలు ప్రారంభించడానికి వేచి చూస్తారు. అంతేకాదు ఈ రోజున బంగారం ఇతర ఆభరణాలు కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీ దేవిని ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. ఈరోజున బంగారం తీసుకురావడం వలన లక్ష్మీదేవి తమ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని నమ్మకం. ఇలా జరిగినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుందని విశ్వసిస్తారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున వచ్చే ఈ ప్రత్యేక దినం ఈ ఏడాది 3 మే 2022న వచ్చింది. వివాహం చేసుకోవడానికి ఈ రోజు చాలా శుభప్రదమని పెద్దల నమ్మకం.
శాస్త్రాల ప్రకారం, ఈ రోజున వివాహం చేసుకుంటే జీవితాంతం కలిసి ఉండే వరం లభిస్తుంది. ఈ కారణంగానే ముహూర్తాలలో ఈ రోజుకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ముహర్తంతో సంబంధం లేకుండా శుభకార్యాలను నిర్వహిస్తారు. అయితే అక్షయ తృతీయ రోజును వివాహానికి ఎందుకు ప్రత్యేకంగా, పవిత్రంగా భావిస్తారో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం
అక్షయ పేరులోని ప్రత్యేకత: అక్షయ తృతీయ వివాహానికి ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయలో ఉపయోగించే అక్షయ పదానికి అర్ధం ఎప్పటికీ అంతం లేదని. ఈ రోజు ప్రారంభించిన పని ఎప్పటికీ ముగియదని ఒక నమ్మకం. ఈ నమ్మకంతోనే ప్రజలు ఈ రోజున తమ అనేక శుభ కార్యాలను ప్రారంభించడానికి ఆసక్తిని చూపిస్తారు. అందుకే ఈ రోజున పెళ్లి చేసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. కొంతమంది ఈ రోజు కోసం పెళ్లి చేసుకోవడానికి వేచి ఉంటారు. దీని ప్రత్యేక ప్రాముఖ్యత కారణంగా.. అక్షయ తృతీయకు వివాహ ముహూర్తాలలో ప్రత్యేక హోదా వచ్చింది.
బృహస్పతి, శుక్రుడు: ఈసారి వైశాఖ తృతీయ తిథి 3వ తేదీన వచ్చింది. 3వ సంఖ్యకు బృహస్పతి అధిపతి. ఈసారి గురు గ్రహం శుభ లగ్నంలో ఉంటుందని… అలా జరిగినప్పుడు వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున శుక్రుడు కూడా యోగ స్థానంలో ఉంటాడని… ఇది వివాహ యోగం కోణంలో కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
కుజదోషం: అక్షయ తృతీయ నాడు వివాహం చేసుకోవడం ద్వారా కుజదోషం తొలగిపోతుందని శాస్త్రాలలో చెప్పబడింది. కొందరి జాతకంలో కుజదోషం ఉంటుంది. అలాంటి వధూవరులు ఈ ప్రత్యేక రోజున వివాహం చేసుకోవచ్చు. కుజదోషాన్ని తొలగించవచ్చు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు హానికరమైన గ్రహాల ప్రభావాలను తగ్గించగలదని నమ్ముతారు.
(ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read:
నేడు అక్షయ తృతీయ సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు