Viral Video: సర్దార్ జీ భల్లే భల్లే.. డ్యాన్స్‌ చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..!

Viral Video: డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. ఇందులో కొన్ని డ్యాన్స్‌లు వింతగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. వాటిని చూసిన

Viral Video: సర్దార్ జీ భల్లే భల్లే.. డ్యాన్స్‌ చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు..!
Sardar Ji
Follow us
uppula Raju

|

Updated on: May 03, 2022 | 8:21 AM

Viral Video: డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. ఇందులో కొన్ని డ్యాన్స్‌లు వింతగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో సర్దార్జీ చేసిన డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఆ వయసులో డ్యాన్స్‌ చేయడం అంటే మామూలుగా విషయం కాదు. మీరు ఈ వీడియో చూస్తే సర్దార్జీని కచ్చితంగా ప్రశంసిస్తారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వివాహ వేడుక జరుగుతుందని అర్థమవుతుంది. ఈ వేడుకలో మ్యూజిక్ ప్లే అవడంతోనే సర్దార్జీ తన భార్యతో కలిసి డ్యాన్స్‌ చేయడం మొదలెట్టారు. 70 ఏళ్ల వయసులో అతడి అద్భుత మూమెంట్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడి సూపర్ డ్యాన్స్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు. చెప్పాలంటే సర్దార్ జీ నృత్యం చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ డ్యాన్స్‌ చూసి సంతోషంతో విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వార్తలు రాసే సమయానికి 22 వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ప్రజలు దీనిపై వ్యాఖ్యానిస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యూత్‌ కూడా వారి ముందు పనికిరారని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. మరోవైపు, ‘బిందాస్ అంకుల్ జీ’ అని మరొక నెటిజన్ కామెంట్‌ చేశాడు. అయితే ‘వయస్సు కేవలం ఒక సంఖ్య, అది సర్దాజీ ద్వారా నిరూపణ అయిందని’ మరొక నెటిజన్‌ తెలిపాడు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Good News: రైతులకి పెద్ద ఊరట.. మోడీ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల సబ్సిడీ..!

IPL 2022: తొమ్మిదో తరగతి ఫెయిల్‌.. కానీ ఈ రోజు ఒక సంచలనం.. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర..!

Study Tips: చదివేటప్పుడు సంగీతం వినడం మంచిదా.. చెడ్డదా.. వాస్తవం తెలుసుకోండి..!