AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Study Tips: చదివేటప్పుడు సంగీతం వినడం మంచిదా.. చెడ్డదా.. వాస్తవం తెలుసుకోండి..!

Study Tips: ఇటీవల చాలా మంది విద్యార్థులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. చదవడం, సంగీతం రెండు పనులు కలిపి చేయవచ్చా..! వాస్తవానికి సంగీతానికి అద్భుతమైన శక్తి ఉంటుంది.

Study Tips: చదివేటప్పుడు సంగీతం వినడం మంచిదా.. చెడ్డదా.. వాస్తవం తెలుసుకోండి..!
Listening To Music
uppula Raju
|

Updated on: May 02, 2022 | 1:52 PM

Share

Study Tips: ఇటీవల చాలా మంది విద్యార్థులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. చదవడం, సంగీతం రెండు పనులు కలిపి చేయవచ్చా..! వాస్తవానికి సంగీతానికి అద్భుతమైన శక్తి ఉంటుంది. ఇది మనస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. సంగీతం ఒక వ్యక్తి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. చాలా మంది విద్యార్థులు లైబ్రరీలో చదివేటప్పుడు ఇయర్‌ ఫోన్స్‌ ధరించి సంగీతం వినడం మనం గమనించవచ్చు. సంగీతం విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సంగీతం ఒక వ్యక్తిని సంతోషపరుస్తుంది. శక్తి స్థాయిని పెంచుతుంది. ఆందోళన స్థాయిని తగ్గించడమే కాకుండా విద్యార్థులు పరీక్షను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇది నిద్రలేమి, ఆందోళన, ఏకాగ్రత లోపానికి సహజ చికిత్స అని చెప్పవచ్చు. ఇష్టమైన సంగీతం మెదడులోని ‘ఫీల్ గుడ్ హార్మోన్’ డోపమైన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

వాస్తవానికి సంగీతాన్ని వినడం వల్ల తెలివితేటలు, పరీక్ష స్కోర్‌లు మెరుగుపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతం వినే విద్యార్థులు చదువులో మెరుగ్గా రాణిస్తారు. సంగీతం మన మెదడులోని కొన్ని భాగాలను ప్రేరేపిస్తుంది. దీని వల్ల విద్యార్థుల గణిత సామర్థ్యం పెరుగుతుందని ఒక పరిశోధనలో తేలింది. సంగీతం ఒక వ్యక్తి మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. సంగీతం జ్ఞాపకశక్తి, దృష్టి, తార్కిక శక్తిని మెరుగుపరుస్తుంది. ఒక వ్యక్తి విజయం ఈ విషయాలన్నింటిపై ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని పరిశోధనలలో మాత్రం సంగీతం ఒక వ్యక్తిని కలవరపెడుతుందని తేలింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని సూచించాయి.

మరిన్ని కెరీర్ వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి

PM Kisan: రైతులకి శుభవార్త.. ఈ వారమే ఖాతాలలోకి 2000 రూపాయలు..!