PM Kisan: రైతులకి శుభవార్త.. ఈ వారమే ఖాతాలలోకి 2000 రూపాయలు..!

PM Kisan: నిరీక్షణ ముగిసింది. ఈ వారమే ప్రభుత్వం రైతుల ఖాతాలలో 2000 రూపాయలు వేయబోతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు పూర్తి చేసినట్లు వ్యవసాయ మంత్రిత్వ

PM Kisan: రైతులకి శుభవార్త.. ఈ వారమే ఖాతాలలోకి 2000 రూపాయలు..!
Pm Kisan
Follow us
uppula Raju

|

Updated on: May 02, 2022 | 6:46 AM

PM Kisan: నిరీక్షణ ముగిసింది. ఈ వారమే ప్రభుత్వం రైతుల ఖాతాలలో 2000 రూపాయలు వేయబోతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు పూర్తి చేసినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రభుత్వం ‘రైతు భాగస్వామ్యం-ప్రాధాన్యత హమారీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని కింద పెద్ద సంఖ్యలో రైతులకు KCC ( కిసాన్ క్రెడిట్ కార్డ్ ) కార్డులు అందిస్తుంది. ఈ పథకం కూడా PM కిసాన్ పథకానికి అనుసంధానించారు. ఇప్పుడు ఈ ప్రచారం ముగియడంతో రైతుల ఖాతాలలోకి 11వ విడత డబ్బులు విడుదల చేయనుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద సంవత్సరానికి రూ. 6000 మూడు విడతలుగా అందజేస్తారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు 11 కోట్ల మంది రైతుల డేటా వెరిఫై అయ్యిందని ఒక అధికారి తెలిపారు. ఈ సందర్భంగా రైతులు ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ పథకం కింద దాదాపు 22000 కోట్ల రూపాయలు ఒకేసారి విడుదలవుతాయి. కాబట్టి మీ ఖాతా స్టేటస్‌ని చెక్ చేస్తూ ఉండండి.

మీ రికార్డును ఇలా చెక్ చేసుకోండి

1. ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.

2. ఇందులో కుడివైపున ‘ఫార్మర్స్ కార్నర్’ కనిపించనుంది. ఇందులో బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.

3. ఇందులో ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయడం ద్వారా మీ స్టేటస్‌ తనిఖీ చేయవచ్చు. ఏదైనా సమస్య ఉన్నా తెలుస్తుంది.

4. మీరు లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయడం ద్వారా మీ గ్రామంలోని లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చూడవచ్చు. ఇందులో లబ్ధిదారులందరి పూర్తి జాబితాను ప్రభుత్వం అప్‌లోడ్ చేస్తుంది.

ప్రధానమంత్రి కిసాన్ యోజన అనేది మోడీ ప్రభుత్వం అతిపెద్ద రైతు పథకం. ఇందులో రైతులకు 10 విడతల ద్వారా రూ.1.81 లక్షల కోట్లు అందించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేస్తోంది. ఇప్పుడు రైతుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నంబర్ కూడా అందుబాటులో ఉంది. ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చు. PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 155261 మరియు 011-24300606. కాల్‌ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Health Tips: షుగర్‌ పేషెంట్లకి గమనిక.. ఎండాకాలం వీటి విషయంలో జాగ్రత్త..!

Health Tips: 40 ఏళ్లు దాటిన పురుషులు.. ఒక్కసారి ఈ 4 విషయాలని గమనించండి..!

Health Tips: మీరు చేస్తున్న ఈ 4 తప్పుల వల్లే అధిక బరువు.. అస్సలు చేయవద్దు..!