Health Tips: 40 ఏళ్లు దాటిన పురుషులు.. ఒక్కసారి ఈ 4 విషయాలని గమనించండి..!
Health Tips: నలబై ఏళ్లు దాటిన పురుషులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వయసులో ప్రత్యేక శ్రద్ద అవసరం. ఎందుకంటే
Health Tips: నలబై ఏళ్లు దాటిన పురుషులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వయసులో ప్రత్యేక శ్రద్ద అవసరం. ఎందుకంటే శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు ప్రారంభమవుతాయి. ఇది తరచుగా బరువు పెరుగుట, బెల్లీ ఫ్యాట్‌కి కారణమవుతుంది. ఇవి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. సకాలంలో నియంత్రించకపోతే ప్రాణాంతకంగా మారుతాయి. శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి.
1. తరచుగా టెన్షన్‌లో ఉండటం
ఆఫీసులో పనిభారం, ఇంటి బాధ్యతల వల్ల మగవాళ్లు తరచూ టెన్షన్ పడాల్సి వస్తుంది. దీనివల్ల హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది అధిక రక్తపోటు, ఊబకాయానికి దారితీస్తుంది.
2. హార్మోన్ల అసమతుల్యత
40 ఏళ్ల తర్వాత పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్రావం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కొవ్వు పరిమాణాన్ని పెంచుతుంది. దీంతో బెల్లీ ఫ్యాట్ ఎక్కువవుతుంది. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి. శాకాహారం తీసుకుంటే మంచిది.
3. శరీర కార్యకలాపాలు తగ్గడం
ఈ వయసులో పురుషుల బాధ్యతలు పెరుగుతాయి. వాటిని నెరవేర్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. దీనివల్ల ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. ముఖ్యంగా జిమ్‌లో వ్యాయామం చేయడానికి సమయం దొరకదు. శారీరక శ్రమ తక్కువగా ఉంటే అది శరీరంపై చెడు ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోండి.
4. జీవక్రియకి ఆటంకాలు
40 ఏళ్లు దాటిన తర్వాత జీవక్రియ రేటు తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా కేలరీలను బర్న్ చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఇది మీ బరువును నేరుగా ప్రభావితం చేస్తుంది. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి ఈ వయసు వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.