Gold Loan: ఇంట్లో ఉండే బంగారంపై లోన్ తీసుకోవచ్చు.. ఇలా చేయండి చాలు..
కరోనా(Corona) కారణంగా గత రెండేళ్లలో బ్యాంకింగ్(Banking) రంగంలో చాలా మార్పులు వచ్చాయి. దాదాపు ఇప్పుడు బ్యాంక్ వెళ్లకుండా పనులు చేసుకుంటున్నారు ఖాతాదారులు.
కరోనా(Corona) కారణంగా గత రెండేళ్లలో బ్యాంకింగ్(Banking) రంగంలో చాలా మార్పులు వచ్చాయి. దాదాపు ఇప్పుడు బ్యాంక్ వెళ్లకుండా పనులు చేసుకుంటున్నారు ఖాతాదారులు. అయితే బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలంటే తప్పకుండా బ్యాంక్‌కు వెళ్లాల్సిందే.. కోవిడ్ కారణంగా కొన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు(NBFC), ఫిన్‌టెక్ రుణ సంస్థల వంటివి ఇంటి వద్దకే గోల్డ్ లోన్సేవలను ప్రారంభించాయి. ఫెడరల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్, ఇండెల్మనీ, మణప్పురం, ఫిన్‌టెక్ లెండర్స్ రుపీక్, రప్టాక్, ధండన్ గోల్డ్ వంటి ఆర్థిక సంస్థలు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ, ఫిన్‌టెక్ సంస్థల వెబ్‌సైట్, యాప్ ద్వారా గోల్డ్ లోన్ డోర్‌స్టెప్ సర్వీస్ పొందేందుకు అపాయింట్మెంట్బుక్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఆయా సంస్థల నుంచి లోన్ మేనేజర్ మీ ఇంటికి వచ్చి అవసరమైన ప్రక్రియ, బంగారం విలువ కట్టటం వంటివి పూర్తి చేస్తారు. మీ గుర్తింపు కోసం ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, అడ్రస్ కోసం విద్యుత్తు బిల్లు, టెలిఫోన్ బిల్లు జిరాక్స్ సహా ఫొటోలు తీసుకుంటారు. రుణం ఇచ్చే పరిమితి ఆయా సంస్థలను బట్టి మారుతుంటుంది. ఫెడరల్బ్యాంకులో డోర్‌స్టెప్ సర్వీస్ ద్వారా బంగారం రుణానికి దరఖాస్తు చేసినట్లయితే.. దాని పరిమితి రూ.50వేల నుంచి రూ.1 కోటి వరకు ఉంటుంది. ఫిన్‌టెక్ లెండర్ ధండర్ గోల్డ్‌లో తీసుకోవాలంటే.. అది రూ.25వేల నుంచి రూ.75 లక్షల వరకు లభిస్తుంది. అలాగే.. కనీస రుణ చెల్లింపు వ్యవధి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది.
Read Also.. Car Loan: కారు కొనాలని అనుకుంటున్నారా.. తక్కువ వడ్డీకి లోన్ ఇస్తున్న బ్యాంకుల వివరాలివే..