New Labour Code: జూలై 1 నుంచి పనిలో పెద్ద మార్పు.. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం..!

New Labour Code: జూలై 1 నుంచి పనిలో పెద్ద మార్పు రాబోతోంది. కొత్త లేబర్ కోడ్ అమలుతో పని గంటలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు టేక్ హోమ్ సాలరీ కూడా తగ్గుతుంది.

New Labour Code: జూలై 1 నుంచి పనిలో పెద్ద మార్పు.. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం..!
New Labour Code
Follow us
uppula Raju

|

Updated on: May 02, 2022 | 8:43 AM

New Labour Code: జూలై 1 నుంచి పనిలో పెద్ద మార్పు రాబోతోంది. కొత్త లేబర్ కోడ్ అమలుతో పని గంటలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు టేక్ హోమ్ సాలరీ కూడా తగ్గుతుంది. అయితే పీఎఫ్‌లో జమచేసే మొత్తం పెరుగుతుంది. అలాగే ఉద్యోగులకి వారానికి రెండు లేదా మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి లేబర్ కోడ్‌ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో సిద్దం చేసింది. కానీ ప్రస్తుతం అది రాష్ట్రాలలో పరిశీలనలో ఉంది. ప్రభుత్వం 4 కొత్త లేబర్ కోడ్‌లను సిద్ధం చేసింది. ఈ లేబర్ కోడ్‌లన్నింటినీ వీలైనంత త్వరగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ లేబర్ కోడ్‌కు సంబంధించి కొన్ని నిబంధనలను సిద్ధం చేయలేదు. దీంతో దీని అమలులో జాప్యం జరుగుతోంది. అన్ని సవ్యంగా జరిగితే జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

కొత్త కార్మిక చట్టం వల్ల దేశంలో పెట్టుబడులు పెరుగుతాయని దీంతో ఉపాధి పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. కొత్త కార్మిక చట్టంతో కంపెనీలు తమ కార్యాలయ వేళల్లో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. పనిని బట్టి కార్యాలయ సమయాలను సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కార్యాలయంలో 8 నుంచి 9 గంటలపాటు పని జరుగుతుండగా దానిని 12 గంటలకు పెంచుకోవచ్చు. కానీ వారంలో 3 ఆఫ్‌లు ఇవ్వాలి. టేక్-హోమ్ జీతం, ప్రావిడెంట్ ఫండ్‌లో కంపెనీలు డిపాజిట్ చేసే డబ్బుపై మార్పులు ఉంటాయి. కొత్త లేబర్ కోడ్ ఉద్యోగి బేసిక్‌ వేతనాన్ని 50 శాతంగా నిర్ణయిస్తుంది. దీని వల్ల ఉద్యోగులకు మేలు జరగడంతో పాటు పీఎఫ్‌లో ఉద్యోగి, కంపెనీ డిపాజిట్ చేసే సొమ్ము పెరుగుతుంది. టేక్ హోమ్ జీతం కొంతమంది ఉద్యోగులకు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి తగ్గుతుంది.

ఒక నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు లేబర్ కోడ్ నిబంధనలని సిద్ధం చేశాయి. మిగిలిన 7 రాష్ట్రాలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వం కేంద్ర కార్మిక చట్టాన్ని 4 వేర్వేరు కోడ్‌లుగా విభజించింది. ఇందులో జీతం, సామాజిక భద్రత, పరిశ్రమ, ఉద్యోగుల మధ్య సంబంధాలు, పనిలో భద్రత, ఆరోగ్యం ఉన్నాయి. ఈ కోడ్‌లన్నింటినీ పార్లమెంటు ఆమోదించింది. కానీ కార్మిక చట్టాలు ఉమ్మడి జాబితా కిందకు వస్తాయి. కాబట్టి కేంద్రం ఈ నిబంధనలను రాష్ట్రాలు కూడా పరిశీలించాలని కోరుతోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: ధోని మాటలు విన్నాడు.. ఇప్పుడు ‘హీరో’ అయ్యాడు..

Liver Failure: ఈ లక్షణాలు శరీరంలో కనిపిస్తే లివర్ ఫెయిల్యూర్‌ అయినట్లే జాగ్రత్త..!

Brian Lara Birthday: ఆ సమయంలో బ్రియాన్‌ లారాతో ఎవరూ మాట్లాడలేదు.. ఎందుకంటే..?