Google Play Store: సంచలన నిర్ణయం తీసుకున్న గూగుల్‌.. 12 లక్షల యాప్స్ బ్లాక్‌ చేస్తూ నిర్ణయం..

ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌(Google).. యాప్స్‌కు భారీ షాకిచ్చింది. గూగుల్ ప్లేస్టో్ర్‌లో దాదాపు 12 లక్షల యాప్స్‌(Apps)ను బ్లాక్‌ చేసింది...

Google Play Store: సంచలన నిర్ణయం తీసుకున్న గూగుల్‌.. 12 లక్షల యాప్స్ బ్లాక్‌ చేస్తూ నిర్ణయం..
Follow us
Srinivas Chekkilla

| Edited By: Anil kumar poka

Updated on: May 02, 2022 | 9:42 AM

ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌(Google).. యాప్స్‌కు భారీ షాకిచ్చింది. గూగుల్ ప్లేస్టో్ర్‌లో దాదాపు 12 లక్షల యాప్స్‌(Apps)ను బ్లాక్‌ చేసింది. 2021లో గూగుల్‌ ప్లేస్టోర్‌ ప్రైవసీ పాలసీ నిబంధనల్ని ఉల్లంఘించినందునే 12లక్షల యాప్స్‌పై చర్యలు తీసుకున్నట్లు గూగుల్‌ వెల్లడించింది. ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్స్‌(Loan Apps)తో జనాల్ని పీక్కుతింటున్న యాప్‌లు గూగుల్‌ ప్లేస్టోర్‌లో చాలానే ఉన్నాయని గూగుల్‌ గుర్తించింది. అలాంటి మోసపూరిత, సేఫ్‌ కానీ యాప్‌లపై చెక్‌ పేట్టే ప్రయత్నం చేసింది. 12లక్షల యాప్స్‌ను నిషేధించింది. దీంతో పాటు స్పామ్‌ డెవలపర్స్‌గా అనుమానిస్తున్న 2లక్షల యాప్స్‌ను, ఇన్‌ యాక్టీవ్‌గా ఉన్న మరో 5లక్షల యాప్స్‌ను పక్కన బెట్టింది.

బ్లాక్‌ చేసిన యాప్స్‌ తమ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. తమ యూజర్ల సెక్యూరిటీకి భరోసా ఇచ్చేలా వాటిని ప్లే స్టోర్‌ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే స్పామ్‌, మాల్‌వేర్‌, డేంజరస్‌ యాప్స్‌లను ఎప్పటికప్పుడు స్కాన్‌ చేస‍్తూ ఉంటామని గూగుల్‌ స్పష్టం చేసింది. ఇప్పటికే యాక్సెసిబిలిటీ లేని కారణంగా ఆండ్రాయిడ్ యాక్సెసిబిలిటీ APIలను ఉపయోగించే యాప్‌లపై నిషేధం విధించింది. ఆండ్రాయిడ్‌లో కాల్‌లను రికార్డ్ చేయడానికి థర్డ్-పార్టీ యాప్‌లకు యాక్సెసిబిలిటీ APIలు ఏకైక మార్గం కాబట్టి, Google Playలో కాల్-రికార్డింగ్ యాప్‌లు డెడ్‌గా ఉంటాయి.

Read Also… Multibagger Stock: లక్ష పెట్టుబడిని రూ.10 కోట్లుగా మార్చిన బంపర్ స్టాక్.. మీరు కొన్నారా..