Stock Market: నష్టాలతో నెల ప్రారంభించిన స్టాక్ మార్కెట్.. బేర్ పంజాతో సూచీల కుదేలు..

Stock Market: గత వారం లాభాల్లో నడిచి చివరి రోజున అనూహ్యంగా నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. ఈ తరుణంలో నెల ప్రారంభంలో కూడా మార్కెట్లు బేర్ బాట పట్టాయి.

Stock Market: నష్టాలతో నెల ప్రారంభించిన స్టాక్ మార్కెట్.. బేర్ పంజాతో సూచీల కుదేలు..
Stock Market
Follow us

|

Updated on: May 02, 2022 | 10:12 AM

Stock Market: గత వారం లాభాల్లో నడిచి చివరి రోజున అనూహ్యంగా నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. ఈ తరుణంలో నెల ప్రారంభంలో కూడా మార్కెట్లు బేర్ బాట పట్టాయి. ప్రధానమైన మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదంయ 9.40 నిమిషాయ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 450కి పైగా పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 145 పాయింట్ల మేర నష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 140కి పైగా పాయింట్ల నష్టంలో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఏకంగా 240 పాయింట్ల మేర నష్టపోయింది. ఆటో సెక్టార్ షేర్లు ఎక్కువ ఫోకస్ లో ఉన్నాయి.

నిఫ్టీ సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.92%, యస్ బ్యాంక్ 2.20%, మహీంద్రా అండ్ మహీంద్రా 0.89%, అల్ట్రాటెక్ సిమెంట్ 0.81%, యాక్సిస్ బ్యాంక్ 0.67%, హెచ్డీఎఫ్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ 0.54%, యూపీఎల్ 0.46%, ఐటీసీ 0.13% మేర ఆరంభంలో లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో టైటాన్ కంపెనీ 2.40%, ఏషియా పెయింట్స్ 2.34%, ఇన్ఫోసిస్ 2.06%, సన్ ఫార్మా 1.99%, విప్లో 1.98%, హిందాల్కో 1.71%, బజాజ్ ఆటో 1.69%, ఐచర్ మోటార్ 1.61%, ఓఎన్జీసీ 1.59%, కోల్ ఇండియా 1.56% మేర ఆరంభంలో నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Google Play Store: సంచలన నిర్ణయం తీసుకున్న గూగుల్‌.. 12 లక్షల యాప్స్ బ్లాక్‌ చేస్తూ నిర్ణయం..

Liquor Home Delivery: దేశంలో మద్యాన్ని ఎందుకు హోమ్ డెలివరీ ఇవ్వరో తెలుసా.. అసలు జనం ఏమి కోరుకుంటున్నారంటే..