Edible Oil: వంట నూనెల ధరలపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. విషయం ఏంటంటే?

Edible Oil: గత కొంత కాలం నుంచి వంటనూనె ధరలు వరుసగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదే సమయంలో వాటి ధరలు మరింత పెరుగుతాయని మీడియాలో అనేక వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో కేంద్రం ఒక గుడ్ న్యూస్ తెలిపింది.

Edible Oil: వంట నూనెల ధరలపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. విషయం ఏంటంటే?
Cooking Oil
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 02, 2022 | 10:49 AM

Edible Oil: దేశంలో వంటనూనెల కొరత ఏర్పడనుందని.. అంతర్జాతీయ కారణాల కారణంగా వాటి ధరలు మరింతగా పెరుగుతాయని అనేక వార్తలు వస్తున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలిపింది. అదేంటంటే.. ప్రస్తుతం దేశంలో అవసరాలకు సరిపడా వంటనూనెలు అందుబాటులో ఉన్నయాని కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. వంటనూనెల ధరలను, దిగుమతుల రవాణా పరిస్థితులను(Oil Imports) కేంద్రం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆయిల్ పరిశ్రమలు అందించిన వివరాల ప్రకారం దేశంలో ప్రస్తుతం 21 లక్షల టన్నుల వంట నూనెలు అందుబాటులో ఉండగా.. మరో 12 లక్షల టన్నుల నూనెలు రవాణాలో ఉన్నాయని తెలిపింది. రవాణాలో ఉన్న వంటనూనెలు మే నెలలో దేశ అవసరాలకు అందుబాటులోకి వస్తాయని వినియోగదారుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులను నిరోధించటం వల్ల భారత్ పై ఎలాంటి ప్రభావం ఉండదని.. అందుకు అవసరమైన వంట నూనె నిల్వలు దేశంలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

నూనె గింజల ఉత్పత్తికి సంబంధించిన వివరాలు చూస్తే 2021-22 సంవత్సరంలో సోయాబీన్ ఉత్పత్తి ఉత్తమ స్థాయిలో ఉంది. గత సంవత్సరం కంటే ఎక్కువగా 126.10 లక్షల టన్నులుగా ఇవి ఉన్నట్లు నివేదిక ప్రకారం తెలిసింది. మరో పక్క ఆవాల నూనె ఉత్పత్తి 114 లక్షల టన్నులుగా ఉండనుందని తెలుస్తోంది. ఇందుకోసం దేశంలో 37 శాతం అధికంగా పంట వేశారు. ఈ తరుణంలో పౌర సరఫరాల శాఖ వంట నూనెల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. తద్వారా వినియోగదారులపై ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇదే సమయంలో ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి 62 శాతం, అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయాబీన్ ఆయిల్ దిగుమతి 22 శాతం, ఉక్రెయిన్, రష్యాల నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ 15 శాతంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా తక్కువ ఉత్పత్తి, ఎగుమతులపై ఉత్పత్తి దేశాల అధిక పన్నులతో పాటు ఇతర కారణాలు వంటనూనెల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో భారత్ నూనె గింజల తయారీలో అగ్రగామిగా ఉంటూ 2021-22 ఏడాదిలో 37.14 మిలియన్ టన్నుల గింజలను పండించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Stock Market: నష్టాలతో నెల ప్రారంభించిన స్టాక్ మార్కెట్.. బేర్ పంజాతో సూచీల కుదేలు..

Liquor Home Delivery: దేశంలో మద్యాన్ని ఎందుకు హోమ్ డెలివరీ ఇవ్వరో తెలుసా.. అసలు జనం ఏమి కోరుకుంటున్నారంటే..