AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భార్యని ఆ పరిస్థితిలో చూసిన భర్తకి ఫ్యూజులౌట్‌..!

Viral Video: భార్యాభర్తల బంధం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. ఈ బంధంలో ప్రేమ, కోపం, సుఖం, దుఖం అన్నీ ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో భార్యాభర్తలకు సంబంధించిన

Viral Video: భార్యని ఆ పరిస్థితిలో చూసిన భర్తకి ఫ్యూజులౌట్‌..!
Wife Prank Video,
uppula Raju
|

Updated on: May 02, 2022 | 12:36 PM

Share

Viral Video: భార్యాభర్తల బంధం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. ఈ బంధంలో ప్రేమ, కోపం, సుఖం, దుఖం అన్నీ ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో భార్యాభర్తలకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు నవ్విస్తే.. మరికొన్ని భావోద్వేగాలను కలిగి ఉంటాయి. ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇది చాలా ఫన్నీ వీడియో. ఇందులో భార్య తన భర్తని ఆటపట్టించడానికి ఒక భయంకర చిలిపి పని చేసింది. దీంతో భర్త పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా నవ్వుతారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో భర్త బెడ్‌పై హాయిగా పడుకొని ఉండటం మనం వీడియోలో చూడవచ్చు. అతడిని భయపెట్టేందుకు భార్య ఒక చిలిపి పని చేసింది. బెడ్‌పై చిన్న టేబుల్ వేసి దుప్పటి కప్పుకొని గాలిలో వేలాడుతున్నట్లు పడుకుంటుంది. ఆ పొజిషిన్‌లో చూస్తే ఎవ్వరైనా ఆమె గాలిలో తేలుతుంది అనుకుంటారు. కొన్నిసార్లు ఇలాంటి దృశ్యాలు దెయ్యం చిత్రాలలో కనిపిస్తాయి. అయితే ఆమె తన భర్తను భయపెట్టాలనే ఉద్దేశ్యంతో అలా చేసింది. భర్త నిద్రలేచి ఒక్కసారిగా గాల్లో వేలాడుతున్న భార్యని చూసి జడుసుకుంటాడు. అంతేకాదు మంచంపై నుంచి కిందపడి షాక్‌ కి గురవుతాడు. అప్పుడు భార్య నవ్వుతూ దుప్పటి తొలగించడంతో అసలు రహస్యం బయటపడుతుంది. దీంతో భర్త షాక్‌ నుంచి తేరుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని ఇప్పటివరకు 31 మిలియన్ల వీక్షణలను పొందింది. 13 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేశారు. కొంతమంది నెటిజన్లు ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలపండి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: గోడకి ప్లాస్టరింగ్ ఇలా కూడా చేయొచ్చా బాబు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

Knowledge Photos: వడ్రంగి పిట్ట చెట్టుకి రంధ్రాలు ఎందుకు చేస్తుంది.. దాని వెనుకున్న సీక్రెట్‌ ఏంటంటే..?

Vegetables: వేసవిలో ఈ 5 సీజనల్‌ కూరగాయలు కచ్చితంగా తినాలి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!