Vegetables: వేసవిలో ఈ 5 సీజనల్‌ కూరగాయలు కచ్చితంగా తినాలి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

Vegetables: వేసవిని తట్టుకునేందుకు ఫ్యాన్లు, ఏసీలు మాత్రమే సరిపోవు. శరీరం లోపలి వ్యవస్థని కూడా చల్లబరచాలి. దీనికి సులభమైన మార్గం సీజనల్ కూరగాయలను ఆహారంలో

Vegetables: వేసవిలో ఈ 5 సీజనల్‌ కూరగాయలు కచ్చితంగా తినాలి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Vegetables
Follow us

|

Updated on: May 02, 2022 | 10:37 AM

Vegetables: వేసవిని తట్టుకునేందుకు ఫ్యాన్లు, ఏసీలు మాత్రమే సరిపోవు. శరీరం లోపలి వ్యవస్థని కూడా చల్లబరచాలి. దీనికి సులభమైన మార్గం సీజనల్ కూరగాయలను ఆహారంలో చేర్చడమే. ఎందుకంటే వీటిలో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇవి శరీరాన్ని చల్లబరచడానికి పని చేస్తాయి. దీని కారణంగా మీరు రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటారు. సొరకాయ, దోసకాయ వంటి కూరగాయలలో నీరుశాతం ఎక్కువగా ఉంటుంది. మీరు వీటిని అనేక విధాలుగా తినవచ్చు. సూప్, కూర, రసం మొదలైన రూపంలో తీసుకోవచ్చు.

1. దోసకాయ

దోసకాయను సలాడ్‌ రూపంలో తినవచ్చు. మీరు దీన్ని శాండ్‌విచ్‌లలో కూడా ఉపయోగించవచ్చు. ఇందులో చాలా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇందులో విటమిన్ కె, విటమిన్ సి ఉంటాయి. ఎండాకాలం తప్పనిసరిగా తీసుకోవాలి.

2. సొరకాయ

ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు నీటి పరిమాణం కూడా చాలా ఎక్కువ. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు చాలా మేలు చేస్తుంది. జీర్ణ సమస్యలు, చెడు కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దీన్ని తినవచ్చు.

3. గుమ్మడికాయ

గుమ్మడికాయలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది వ్యాధుల నుంచి రక్షించడానికి పనిచేస్తుంది. గుమ్మడికాయలో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. గుండె జబ్బుల సమస్యను దూరం చేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.

4. కాకరకాయ

ఇందులో కాల్షియం, విటమిన్ సి, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది వేసవిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. పొట్ట, గుండె జబ్బుల సమస్యలను నయం చేయడంలో కాకర రసం పనిచేస్తుంది. దీనిని చాలా కాలంగా ఆయుర్వేదంలో వాడుతున్నారు.

5. పచ్చి బఠానీ

పచ్చి బఠానీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని ఉడికించి, వేయించి ఆహారంగా తీసుకోవచ్చు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ప్రోటీన్, ఐరన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు కూడా ఇందులో ఉంటాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: రవీంద్ర జడేజా అర్థం చేసుకోలేదు.. కానీ ధోని అవకాశం ఇచ్చాడు.. ఇప్పుడతను ఒక సంచలనం..!

Summer Tour: మద్యప్రదేశ్‌లోని అందమైన హిల్‌ స్టేషన్లు.. వేసవి పర్యటనకి సూపర్..!

New Labour Code: జూలై 1 నుంచి పనిలో పెద్ద మార్పు.. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం..!