కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court on Covid-19 Vaccination: కోవిడ్ టీకాలు వేయించుకోమని ఏ వ్యక్తిని బలవంతం చేయకూడదని దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) స్పష్టంచేసింది. ఈ విషయంలో ఆర్టికల్ 21 కల్పిస్తున్న గోప్యత హక్కును గౌరవించాలని సూచించింది.

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court
Follow us

|

Updated on: May 02, 2022 | 12:42 PM

Supreme Court on Covid-19 Vaccination: కోవిడ్ టీకాలు వేయించుకోమని ఏ వ్యక్తిని బలవంతం చేయకూడదని దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) స్పష్టంచేసింది. ఈ విషయంలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లోని నిబంధనను గౌరవించాలని సూచించింది. ప్రస్తుతంలో దేశంలో అమలు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ విధానం అసమంజసమైనది, ఏకపక్షంగా ఉందని చెప్పలేమంటూ పిటిషనర్ వాదనతో సుప్రీంకోర్టు విభేదించింది. అదే సమయంలో విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం రూపొందించిన పాలసిలో కొన్ని షరతులు విధించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. టీకాలు వేయని వ్యక్తులను బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించడాన్ని నిరోధించేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు విధించిన షరతులను ప్రస్తుత పరిస్థితుల కారణంగా రీకాల్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.  కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఇలాంటి ఆంక్షలు సరికాదని పేర్కొంది. అలాగే కోవిడ్-19 వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాలకు సంబంధించిన డేటాను బహిరంగపరచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

టీకాలను తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషనర్ డాక్టర్ జాకబ్ పులియేల్ తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తంచేశారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్‌లో మాజీ సభ్యుడైన ఆయన.. కోవిడ్ వ్యాక్సిన్ క్లీనికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను బహిర్గతం చేసేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరారు. భారత్‌లో ఇస్తున్న కోవిడ్ టీకాలపై సరైన పరిశోధనలు జరగలేదని, టీకాల వల్ల కలిగే దుష్ప్రభావాలకు సంబంధించిన డేటాను బయటపెట్టకపోవడం సరికాదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.

Covid 19 Vaccine

Covid 19 Vaccine

వ్యాక్సిన్లు తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అదే సమయంలో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

తమ టీకాలకు సంబంధించిన డేటాను సంబంధింత ప్రభుత్వ రెగ్యులరేటర్‌కు అందజేసినట్లు కోవాగ్జిన్ టీకా ఉత్పత్తి సంస్థ భారత్ బయోటెక్, కోవీషీల్డ్ టీకా ఉత్పత్తి సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సుప్రీంకోర్టుకు తెలియజేశాయి. అయితే తమ పరిశోధనలను చిన్నబుచ్చేలా పిటిషనర్ వాదనలు ఉన్నట్లు అభ్యంతరం వ్యక్తంచేశాయి.  (Source)

>మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

Also Read..

CIA CTO: అమెరికా గూఢచార సంస్థలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి.. చరిత్రలో తొలిసారిగా..

Telugu Movies: ఈవారం మరింత ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

ఉన్నది 5 వారాలే కానీ.. డబ్బులు మాత్రం భారీగానే పట్టేసింది.!
ఉన్నది 5 వారాలే కానీ.. డబ్బులు మాత్రం భారీగానే పట్టేసింది.!
పీవీఆర్‌ ఐనాక్స్‌, ఖుషీ అడ్వర్టైజింగ్‌తో కీలక ఒప్పందం..
పీవీఆర్‌ ఐనాక్స్‌, ఖుషీ అడ్వర్టైజింగ్‌తో కీలక ఒప్పందం..
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు..
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు..
దసరాకు ముందు పేదలకు గుడ్‌న్యూస్.. కేంద్రం మరో కీలక ప్రకటన
దసరాకు ముందు పేదలకు గుడ్‌న్యూస్.. కేంద్రం మరో కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌పై ‘మీర్జాపూర్‌’ నటుడు పంకజ్‌ త్రిపాఠి ప్రశంసలు..
పవన్‌ కల్యాణ్‌పై ‘మీర్జాపూర్‌’ నటుడు పంకజ్‌ త్రిపాఠి ప్రశంసలు..
బీపీని కంట్రోల్ చేసే బెస్ట్ డ్రింక్స్ ఇవే.. డోంట్ మిస్!
బీపీని కంట్రోల్ చేసే బెస్ట్ డ్రింక్స్ ఇవే.. డోంట్ మిస్!
రిచ్ లుక్‌లో మేడ్ ఇండియా ఈ-స్కూటర్.. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ
రిచ్ లుక్‌లో మేడ్ ఇండియా ఈ-స్కూటర్.. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ
బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పులు లేకుండా కిచ్చా సుదీప్..
బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పులు లేకుండా కిచ్చా సుదీప్..
జీవితంలో ఒక మనిషిని ఇలా ఎవరైనా ప్రేమించగలరా..? సాయి పల్లవి
జీవితంలో ఒక మనిషిని ఇలా ఎవరైనా ప్రేమించగలరా..? సాయి పల్లవి
రెండోసారి తండ్రి కాబోతోన్న రోహిత్ శర్మ.. కివీస్ సిరీస్ నుంచి ఔట్?
రెండోసారి తండ్రి కాబోతోన్న రోహిత్ శర్మ.. కివీస్ సిరీస్ నుంచి ఔట్?