LIC IPO: నేటి నుంచి ఎల్ఐసీ ఐపీవో ప్రారంభం.. పాల్గొనేందుకు ముందుగా వారికే అవకాశం..
LIC IPO: ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)లో పెట్టుబడి పెట్టేందుకు దేశీయంలోని, విదేశాలకు చెందిన 25 మందికి పైగా యాంకర్ ఇన్వెస్టర్లు ఆసక్తిని కనబరిచారు.
LIC IPO: ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)లో పెట్టుబడి పెట్టేందుకు దేశీయంలోని, విదేశాలకు చెందిన 25 మందికి పైగా యాంకర్ ఇన్వెస్టర్లు ఆసక్తిని కనబరిచారు. మార్కెట్ నుంచి రూ. 21,000 కోట్లను సమీకరించడానికి కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం ఎల్ఐసీలోని 3.5 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్లైస్ బ్యాండ్ షేరుకు రూ. 902- రూ. 949 మధ్య ఉంటుందని ప్రకటించింది. దేశ ప్రజలకు సంబంధించిన రూ. 40 లక్షల కోట్ల ఆస్తులను కంపెనీ నిర్వహిస్తోంది. ఈ నెల 4 నుంచి రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రానున్న ఐపీవో.. నేటి నుంచి పాలసీదారులకు, ఉద్యోగులకు ఎల్ఐసీ ఐపీవోలో ముందుగానే పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. అంతేకాదు వీరికోసం ప్రైస్ బ్యాండ్ పై కొంత డిస్కౌంట్ కూడా అందిస్తోంది. 1956లో ఎల్‌ఐసీ ఏర్పడే సమయంలో కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్ల ప్రాథమిక పెట్టుబడిని పెట్టింది. తాజాగా కంపెనీలోని 100 శాతం పెట్టుబడిలో కేవలం 3.5 శాతం వాటాను అమ్మటం ద్వారా కేంద్రం రూ. 21 వేల కోట్లను సమీకరిస్తోంది. మార్చి 17న షేరు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ లలో లిస్టింగ్ అవుతుంది. ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం రూ.75 గా ఉంది.
యాంకర్ ఇన్వెస్టర్లకు 35 శాతం:
ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం LIC IPO ఇష్యూ సమయంలో 50 శాతం షేర్లను యాంకర్ పెట్టుబడిదారులతో సహా అర్హతగల సంస్థాగత పెట్టుబడిదారుల(QIP) కోసం సంస్థ కేటాయించింది. క్యూఐపీ కోసం రిజర్వ్ చేసిన షేర్లలో 35 శాతం యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేసిందని ఐపీవో ప్రక్రియలో ఉన్న ఒక అధికారి తెలిపారు. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ రోజు అంటే మే 2 నుంచి ఇష్యూ ముందుగానే అందుబాటులో ఉంటుంది. LIC మెుత్తం ఇష్యూలో 35 శాతం షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం షేర్లు HNIలకు, 10 శాతం పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేసినట్లు సదరు అధికారి వెల్లడించారు.
ఎల్‌ఐసీలో ప్రభుత్వమే మెజారిటీ స్టేక్ హోల్డర్:
IPO ద్వారా ప్రభుత్వ వాటాలో కొంత తగ్గింపు ఉన్నప్పటికీ, LIC చట్టంలోని సెక్షన్- 37 ప్రకారం ప్రభుత్వం నియంత్రణలో కొనసాగుతుందని LIC మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ మొహంతి తెలిపారు. ఈ వాటా విక్రయాల తరువాత కూడా ఎల్‌ఐసీ ఐపీవోలో ప్రభుత్వ వాటా 51 శాతానికి తగ్గదని తెలిపారు. ఎల్‌ఐసీ తరపున కొత్త షేర్లను జారీ చేసే విధానాన్ని ప్రభుత్వం అనుసరించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. బదులుగా ప్రస్తుతం ఉన్న షేర్లను మాత్రమే విక్రయించాలని నిర్ణయించిదని ఆయన స్పష్టం చేశారు.
ఎల్‌ఐసీకి నిధుల కొరత లేదు:
గత రెండేళ్లలో ఎల్‌ఐసీ నుంచి కేంద్రం డివిడెండ్ తీసుకోలేదని.. రూ. 5,600 కోట్లను కూడా వెనక్కి ఇచ్చిందని మహంతి తెలిపారు. ఈ విధంగా LIC వద్ద తగినంత నగదు ఉందని ఆయన తెలిపారు. IPO తర్వాత ఎల్ఐసీ తొమ్మిది మంది స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ప్రొఫెషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ద్వారా నిర్వహించబడుతుందని తెలిపారు. ఛైర్మన్ పదవి 2024 సంవత్సరం వరకు ఉంటుందని అన్నారు. ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పోస్టుల భర్తీ అవుతాయని తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
CIA CTO: అమెరికా గూఢచార సంస్థలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి.. చరిత్రలో తొలిసారిగా..
Tata Motors: ఏప్రిల్ లో సూపర్ సేల్స్ నమోదు చేసిన టాటా మోటార్స్.. ప్రత్యర్థి కంపెనీలు డీలా..