CIA CTO: అమెరికా గూఢచార సంస్థలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి.. చరిత్రలో తొలిసారిగా..

CIA CTO: భారత సంతతికి చెందిన వ్యక్తి US సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA)లో కీలక ఆఫీసర్ గా ఎంపికయ్యారు. CIA చరిత్రలో మొట్టమొదటిసారి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి నియమితులయ్యారు.

CIA CTO: అమెరికా గూఢచార సంస్థలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి.. చరిత్రలో తొలిసారిగా..
Cia Cto
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 02, 2022 | 12:22 PM

CIA CTO: భారత సంతతికి చెందిన వ్యక్తి US సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA)లో కీలక ఆఫీసర్ గా ఎంపికయ్యారు. CIA చరిత్రలో మొట్టమొదటిసారి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఒక భారత సంతతికి చెందిన నంద్ ముల్చందనీని(Nand Mulchandani) నియమించటం విశేషం. సిలికాన్ వ్యాలీ అనుభవజ్ఞుడైన ముల్చందనీ.. కార్నెల్ నుంచి కంప్యూటర్ సైన్స్, గణితంలో పట్టా, స్టాన్‌ఫోర్డ్ నుంచి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో పాటు హార్వర్డ్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీని పొందారు.

CIAలో చేరడానికి ముందు ముల్చందానీ.. ఇటీవలే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(CTO)గా ఎంపికయ్యారు. గతంలో ఆయన US డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ జాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్‌కి యాక్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కార్నెల్‌కు వెళ్లే ముందు ముల్చందాని ఢిల్లీలోని బ్లూబెల్స్ స్కూల్ ఇంటర్నేషనల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ముల్చందానీ CIA మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఏజెన్సీ అత్యాధునిక ఆవిష్కరణలను, భవిష్యత్ ఆవిష్కరణల కోసం దీర్ఘకాలంలో ఎంతగానో ఉపకరిస్తుందని CIA డైరెక్టర్ విలియం జె బర్న్స్ అన్నారు.

CIAలో చేరడం తనకు గౌరవంగా ఉందని ముల్చందానీ ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన పాత్రలో, సమగ్ర సాంకేతిక వ్యూహాన్ని రూపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే ప్రపంచ స్థాయి మేధస్సు, సామర్థ్యాలను అందించే ఏజెన్సీ అద్భుతమైన సాంకేతిక నిపుణులు, డొమైన్ నిపుణుల బృందంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని ముల్చందానీ వెల్లడించారు.

CIA అంటే ఏమిటి?

సీఐఏ అనేది అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థ. ఇది తన ఏజెంట్లను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేసి కీలక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. తమకు గిట్టని దేశాలపై సీఐఏ ద్వారా చర్యలకు ఉపక్రమిస్తుందని అనేక సందర్బాల్లో వార్తలు వచ్చాయి. దీంతోపాటు రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాన్‌లకు చెందిన నిఘా సంస్థలు.. సీఐఏ ఏజెంట్లను గుర్తించి హతమార్చడం లేదా వారిని తమకు అనుకూలంగా మార్చుకోవడమో చేస్తున్నాయనే వార్తలు రావటం మనం చూశాం. కీలకమైన అనేక ఆపరేషన్లను సీఐఏ అనేక సార్లు విజవంతంగా పూర్తి చేసింది.

ఇవీ చదవండి..

Edible Oil: వంట నూనెల ధరలపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. విషయం ఏంటంటే?

Stock Market: నష్టాలతో నెల ప్రారంభించిన స్టాక్ మార్కెట్.. బేర్ పంజాతో సూచీల కుదేలు..