AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: కన్సాస్‌లో టోర్నడో భారీ విధ్వసం… టోర్నడో వీడియో తీయడానికి వెళ్లి ముగ్గురు స్టూడెంట్స్ మృతి

America: అమెరికాలోని కన్సాస్ (Kansas)లో సోమవారం అత్యంత శక్తివంతమైన టోర్నడో(Tornado) భారీ విధ్వసం సృష్టించింది. దీని ధాటికి వందలాదిగా ఇళ్లు, భవనాలు..

America: కన్సాస్‌లో టోర్నడో భారీ విధ్వసం... టోర్నడో వీడియో తీయడానికి వెళ్లి ముగ్గురు స్టూడెంట్స్ మృతి
Kansas Tornado
Surya Kala
|

Updated on: May 03, 2022 | 6:51 AM

Share

America: అమెరికాలోని కన్సాస్ (Kansas)లో సోమవారం అత్యంత శక్తివంతమైన టోర్నడో(Tornado) భారీ విధ్వసం సృష్టించింది. దీని ధాటికి వందలాదిగా ఇళ్లు, భవనాలు నాశనమయ్యాయి. పలువురు గాయపడ్డారు. ముఖ్యంగా అండోవరెర్ శివారు ప్రాంతం విచితాపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ టోర్నడోతో వంద నిర్మాణాలు ధ్వంసం అయినట్లు తెలిసిందని విచితా మేయర్ తెలిపారు. భారీగా సుడులు తిరుగుతూ వికృతరీతిలో కన్పించిన ఈ పెను సుడిగాలి పరిణామాన్ని మెట్రోలాజిస్టు రీడ్ టిమ్మెర్ వీడియో తీశారు. ఆ వీడియోలో టోర్నడో భయంకరమైన పొగలు కక్కుతూ చుట్టుపక్కల పరిసరాలోని దుమ్మూధూళితో నేలంతా మబ్బుగా పరచుకుంది. ఈ టోర్నడో విధ్వంసం చాలా సేపు కొనసాగింది. ఈ ఇలా విధ్వసం సృష్టించిన ఈ టోర్నడో దృశ్యాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. 31 ఏళ్ల తరువాత ఇంతటి భారీ టొర్నాడో ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ టోర్నడోలకు సంబంధించిన వీడియోలను సుమారు 3 కోట్ల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. టొర్నాడో అంతర్గత శక్తి వేగం ఎంతటి తీవ్రతరం అయినదనేది దృశ్యాల సాయంతో పర్యావరణ వేత్తలు అంచనావేశారు.

అయితే కాన్సాస్‌లో తుఫాను ఛేజింగ్ ట్రిప్ నుండి తిరిగి వస్తుండగా ముగ్గురు వాతావరణ శాస్త్ర విద్యార్థులు కారు ప్రమాదంలో మరణించారు. ఓక్లహోమా విశ్వవిద్యాలయానికి చెందిన నికోలస్ నాయర్ (20), గావిన్ షార్ట్ ( 19), డ్రేక్ బ్రూక్స్ ( 22 ) సంఘటనా స్థలంలో మరణించారు. మిస్టర్ నాయర్, మిస్టర్ షార్ట్ కాన్సాస్‌లోని హెరింగ్‌టన్ నుండి హైవే మీదుగా సుడిగాలి వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటలకే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. తుఫాను వాతావరణంలో ఓక్లహోమాకు తిరిగి వెళుతున్నప్పుడు.. వారి వాహనం హైడ్రోప్లాన్ చేయబడింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు మృతులు టోంకావా, ఓక్లహోమాలో – కాన్సాస్ సరిహద్దు మీదుగా దక్షిణ దిశగా ప్రయాణిస్తున్నారు. వారి వోక్స్‌వ్యాగన్ కారు నీటిపై జారిపడి, ట్రాఫిక్ బయటి లేన్‌లో చిక్కుకుపోయిందని ఓక్లహోమా హైవే పెట్రోల్ తెలిపింది.

తుఫాను ఛేజింగ్ అనేది సుడిగాలి లేదా హరికేన్‌ను ట్రాక్ చేయడం..  అనుసరించడం, తరచుగా ఫోటోలు, వీడియోలు, వాతావరణ పరిస్థితుల రికార్డులను సేకరిస్తుంది. కొంతమంది తుఫాను ఛేజర్‌లు పరిశోధన కోసం లేదా మీడియా కవరేజీ కోసం చేస్తారు, మరికొందరు థ్రిల్ కోసం మాత్రమే చేస్తారు.

శీతల తేమభరిత అస్థిర వాయు పరిణామాల నడుమ , హిమపాతాలకు ముందు ఇటువంటి టోర్నడోలు ఏర్పడతాయి. నల్లని ధట్టమైన మేఘాల మాదిరిగా ఈ టోర్నడోలు ఉంటాయి.

Also Read: Basava Jayanti: నేడు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి జయంతి.. అధికారంగా నిర్వహించనున్న తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు

Medical Education: విద్యార్థులకు అలర్ట్.. ఆ దేశంలో చదవిన వైద్య విద్య చెల్లదు.. సర్కార్ కీలక ప్రకటన..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి