AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forbes List: అగ్రరాజ్యంలో సత్తా చాటిన జగిత్యాల వాసి.. ఏకంగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు..

Forbes List: అగ్రరాజ్యం అమెరికాలో సత్తా చాటారు తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సాగి రఘునందన్‌ రావు. తన అసమాన ప్రతిభతో ఏకంగా ఫోర్బ్స్‌ సీఐవో-2022 జాబితాలో చోటు దక్కించుకున్నారు...

Forbes List: అగ్రరాజ్యంలో సత్తా చాటిన జగిత్యాల వాసి.. ఏకంగా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు..
Forbes Cio 2022
Narender Vaitla
|

Updated on: May 03, 2022 | 11:13 AM

Share

Forbes List: అగ్రరాజ్యం అమెరికాలో సత్తా చాటారు తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సాగి రఘునందన్‌ రావు. తన అసమాన ప్రతిభతో ఏకంగా ఫోర్బ్స్‌ సీఐవో-2022 జాబితాలో చోటు దక్కించుకున్నారు. రఘునంద్‌రావు ప్రస్తుతం ఇన్‌స్పైర్‌ బ్రాండ్స్‌ అనే అంతర్జాతీయ కంపెనీకి సీఐవోగా పని చేస్తున్నారు. ఈయన అమెరికాలోని అట్లాంటాలో నివాసం ఉంటున్నారు. తమ కుమారుడికి ఇంతటి అరుదైన గౌరవం లభించడంతో రఘునందన్‌రావు తల్లిదండ్రులు, అతని స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రఘునందన్‌ నేపథ్యం..

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట గ్రామానికి చెందిన డాక్టర్‌ సాగి సంజీవరావు, పుష్పలత దంపతుల కుమారుడైన సాగి రఘునందన్‌ రావు తన ప్రాథమిక విద్యను వరంగల్‌లో పూర్తి చేసి, జగిత్యాలలోని గీత విద్యాలయం హైస్కూల్‌లో విద్యనభ్యసించారు. అనంతరం గుంటూరులోని విజ్ఞాన్‌ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసి, హైదరాబాద్‌ జేన్టీయూలో ఇంజనీరింగ్‌ చదివారు. తర్వాత పై చదువుల కోసం 1992లో అమెరికా వెళ్లిన రఘునందన్‌ అక్కడి సౌతర్స్ ఎలినియోస్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు.

చదువు పూర్తి చేసిన తర్వాత రఘునందన్‌ తొలుత సెఫోరా అనే కాస్మెటిక్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అనంతరం అంచెలంచెలుగా ఎదుగుతూ.. వాల్‌మార్ట్‌లో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్ స్థాయికి వెళ్లారు. ప్రస్తుతం ఇన్‌స్పైర్ బ్రాండ్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తన అద్భుత పని తీరుతో కంపెనీని లాభాల పట్టించిన రఘునందన్‌, ఇన్‌స్పైర్‌ కంపెనీ 30 బిలియన్ల డాలర్ల సేల్స్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన పనితీరుకు గాను ఫోర్బ్స్‌ సీఐవో జాబితాలో చోటు కల్పించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Border Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న కొత్త పంచాయితీ.. బార్డర్ టోల్‌ ప్లాజా దగ్గర హైడ్రామా!

Viral Video: నానమ్మలోకి మైకెల్‌ జాక్సన్ వచ్చాడా ఏంటి.. ఇదేం డ్యాన్స్‌రా బాబోయ్..!

Visakhapatnam: మొదలైన చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్