Medical Education: విద్యార్థులకు అలర్ట్.. ఆ దేశంలో చదవిన వైద్య విద్య చెల్లదు.. సర్కార్ కీలక ప్రకటన..

Medical Education: మెడిసిన్ చదవడానికి విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. వైద్య విద్యకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్..

Medical Education: విద్యార్థులకు అలర్ట్.. ఆ దేశంలో చదవిన వైద్య విద్య చెల్లదు.. సర్కార్ కీలక ప్రకటన..
Students
Follow us
Shiva Prajapati

|

Updated on: May 03, 2022 | 5:30 AM

Medical Education: మెడిసిన్ చదవడానికి విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. వైద్య విద్యకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్(NMC) కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ముఖ్యంగా పాకిస్తాన్ నుండి MBBS, BDS చదవాలనుకుంటున్న విద్యార్థులకు వర్తిస్తుంది. పాకిస్తాన్‌లో వైద్య విద్యను అభ్యసించి భారత్‌లో వైద్యం చేస్తామంటే ఇకపై కుదరదని, పాకిస్తాన్‌లో చదివిన వైద్య విద్యను ఇక్కడ పరిగనణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.

NMC నోటిఫికేషన్ విడుదల.. పాకిస్తాన్ మెడికల్ డిగ్రీ భారతదేశంలో చట్టవిరుద్ధంగా ప్రకటించింది. ఎవరైనా భారతీయులు, విదేశాలలో నివసిస్తున్న భారత పౌరులు పాకిస్తాన్‌లోని మెడికల్ కాలేజీ నుండి MBBS, BDS లేదా మరేదైనా సమాంతర వైద్య కోర్సు చేసినట్లయితే వారి డిగ్రీ భారతదేశంలో చెల్లుబాటు అవదు అని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) తేల్చి చెప్పింది.

FMGE కూడా రాయలేరు.. NMC వెబ్‌సైట్ nmc.org.in లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పాకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసించిన వారు FMGE పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు కారని స్పష్టం చేసింది. FMGE పరీక్ష విదేశాల్లో మెడిసిన్ చదివి భారత్‌కు వచ్చే వారికోసం నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారు భారతదేశంలో వైద్యం ప్రాక్టీస్‌ చేయడానికి లైసెన్స్ పొందుతారు.

డిసెంబర్ 2018 కటాఫ్ తేదీ.. డిసెంబర్ 2018కి ముందు పాకిస్థాన్‌లోని వైద్య కళాశాల లేదా సంస్థలో చేరిన అభ్యర్థులకు ఈ కొత్త నిబంధన వర్తించదు. నిర్ణీత తేదీ నుండి ఇప్పటి వరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) నుండి సెక్యూరిటీ క్లియరెన్స్‌తో అడ్మిషన్ తీసుకున్న వారికి కూడా ఈ నిబంధన వర్తించదు. అలాగే, వలసదారులు, పాకిస్తాన్ నుంచి వైద్య పట్టా పొందిన వారి పిల్లలు ఇప్పుడు భారతీయ పౌరసత్వం పొందారు. FMGE, NEXT పరీక్షకు వీరు అర్హులు. అలాగే వీరు ఉద్యోగం కూడా చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. అయితే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

యూజీసీ, ఏఐసీటీఈలు వార్నింగ్.. నేషనల్ మెడికల్ కమిషన్ కంటే ముందు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఏఐసీటీఈలు కూడా ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేశాయి. దీని ప్రకారం, పాకిస్తాన్‌లోని ఏ కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుండి భారతీయ విద్యార్థులు తీసుకున్న ఏ డిగ్రీ అయినా భారతదేశంలో చెల్లదు.

Also read:

Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనలో కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ..? సెంటిమెంట్‌తోనే చెక్ పెట్టేందుకు..!

Lord Shiva Worship: సోమవారం నాడు శివుడికి ఇవి సమర్పించండి.. కోరిన కోరికలు నెరవేరుతాయట..!

Viral Video: తొలిసారి బాదంపప్పు టేస్ట్ చేసిన ఉడత.. దాని రియాక్షన్ అస్సలు ఊహించలేరు..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!