Kisan Drone Subsidy: రైతులకు శుభవార్త.. రూ. 5 లక్షలు సహాయం చేస్తున్న కేంద్రం.. ఎందుకోసమంటే..!

Kisan Drone Subsidy: భారతదేశ వ్యవసాయ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికాభివృద్ధిని అందిపుచ్చుకుని..

Kisan Drone Subsidy: రైతులకు శుభవార్త.. రూ. 5 లక్షలు సహాయం చేస్తున్న కేంద్రం.. ఎందుకోసమంటే..!
Drone
Follow us
Shiva Prajapati

|

Updated on: May 03, 2022 | 7:45 AM

Kisan Drone Subsidy: భారతదేశ వ్యవసాయ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికాభివృద్ధిని అందిపుచ్చుకుని.. మన దేశ రైతులు కూడా అత్యాధునిక వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక పథకాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే.. డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగంలో పెను మార్పులకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీని ద్వారా రైతులకు వ్యవసాయ సాగు మరింత సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని భావిస్తోంది. ఇందులో భాగంగానే డ్రోన్ల కొనుగోలు కోసం రైతులకు సబ్సిడీ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో సెలెక్టెడ్ గ్రామాల్లో రైతులకు డ్రోన్‌లు కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తాన్ని సబ్సిడీ కింద ఇవ్వాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే.. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, చిన్న మరియు సన్నకారు రైతులు, మహిళలు, ఈశాన్య రాష్ట్రాల రైతులకు డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి ఖర్చులో 50 శాతం లేదా గరిష్టంగా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించనుంది. ఇతర రైతులకు 40 శాతం లేదా గరిష్టంగా రూ. 4 లక్షల సాయం అందించనుంది.

ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఇన్‌స్టిట్యూట్‌లు, కృషి విజ్ఞాన కేంద్రాలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు డ్రోన్‌ల కొనుగోలు కోసం 100% ఖర్చుతో సహాయం అందించబడుతుంది. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థ (FPO) పొలాల్లో ప్రదర్శన కోసం వ్యవసాయ డ్రోన్ ఖర్చులో 75 శాతం వరకు గ్రాంట్ ఇవ్వబడుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సోమవారం ఢిల్లీలో ‘ప్రోమోటింగ్‌ ఫార్మర్‌ డ్రోన్స్‌: ఇష్యూస్‌, ఛాలెంజెస్‌ అండ్‌ వే ఎహెడ్‌’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు.

వ్యవసాయ రంగంలో డ్రోన్.. పంటల మూల్యాంకనం, భూ రికార్డుల డిజిటలైజేషన్‌, పురుగు మందులు, పోషకాలను పిచికారీ చేసేందుకు ‘కిసాన్‌ డ్రోన్‌’ల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీనిని ప్రోత్సహించేందుకు బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు. దేశ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం ప్రధాని మోదీ ప్రధాన లక్ష్యం అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొన్నారు. తద్వారా రైతులు నూతన సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు. ఈ టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తోమర్ చెప్పారు.

ఉద్యాన పంటలపై పిచికారీ చేయడంలో డ్రోన్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యవసాయంలో డ్రోన్‌లను ప్రోత్సహించడానికి, దాని కొనుగోలులో వివిధ విభాగాలకు రాయితీలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతుల విస్తృత ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనుల్లో డ్రోన్లను ఉపయోగించేందుకు చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.

డ్రోన్ కొనుగోలుకు సంబంధించిన వివరాలు.. 1. రైతు సహకార సంఘాలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు కస్టమ్ హైరింగ్ సెంటర్ల (CHCలు) ద్వారా డ్రోన్ కొనుగోలు కోసం 40 శాతం లేదా రూ. 4 లక్షల వరకు, ఏది తక్కువైతే అది రాయితీ ఇవ్వబడుతుంది. 2. సిహెచ్‌సిలను ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ గ్రాడ్యుయేట్లు డ్రోన్ ధరలో 50% చొప్పున రూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయానికి అర్హులు. డ్రోన్ ప్రదర్శన కోసం ఇప్పటికే గుర్తించిన సంస్థలతో పాటు, వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమైన సెంట్రల్ పిఎస్‌యులను కూడా అర్హత జాబితాలో చేర్చారు. 3. దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక పథకాల ద్వారా సహాయాన్ని అందిస్తోంది. వివిధ వ్యవసాయ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న మానవ శ్రమను తగ్గించడమే కాకుండా ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి, విత్తనాలు, ఎరువులు మరియు నీటిపారుదల నీటి వంటి ఇన్‌పుట్‌ల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఇది రైతులకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది.

ఈ కొత్త సాంకేతికత ఎక్కువ మంది రైతులకు చేరువ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని వల్ల వారికి సౌకర్యాలు, ఖర్చు తగ్గడంతోపాటు ఆదాయం పెరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. మిడతల దండు దాడి సమయంలో ప్రభుత్వం వెంటనే డ్రోన్లు, హెలికాప్టర్లను ఉపయోగించి పంటలను రక్షించిందన్నారు. వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా మాట్లాడుతూ డ్రోన్‌ను రైతుల వద్దకు తీసుకెళ్లేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందన్నారు.

Also read:

Rahul Gandhi Telangana Tour: రాహుల్ పర్యటనలో కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ..? సెంటిమెంట్‌తోనే చెక్ పెట్టేందుకు..!

Lord Shiva Worship: సోమవారం నాడు శివుడికి ఇవి సమర్పించండి.. కోరిన కోరికలు నెరవేరుతాయట..!

Viral Video: తొలిసారి బాదంపప్పు టేస్ట్ చేసిన ఉడత.. దాని రియాక్షన్ అస్సలు ఊహించలేరు..!

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.