By-polls Schedule: మూడు అసెంబ్లీ సీట్ల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. మే 31న పోలింగ్
మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ సీట్ల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మే 31వ తేదీన జరిగే పోలింగ్‌లో ఉత్తరాఖండ్ సీఎం భవిష్యత్తు కూడా తేలనుంది..
Three States By-polls Schedule: మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ సీట్ల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మే 31వ తేదీన జరిగే పోలింగ్‌లో ఉత్తరాఖండ్ సీఎం భవిష్యత్తు కూడా తేలనుంది.. దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మూడు నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల సంఘం.. మే 31న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.. జూన్ 3న ఫలితాలను ప్రకటిస్తారు.. ఎన్నికలు జరగనున్న స్థానాల్లో ఉత్తరాఖండ్‌లోని చంపావత్, ఒడిశాలోని బ్రజ్‌రాజ్‌నగర్, కేరళలోని త్రిక్కక్కర ఉన్నాయి.. ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది.. ఎన్నికల సంఘం ప్రకటనలో సంబంధిత నియోజకవర్గాల్లో కోడ్ అమల్లోకి వచ్చేసింది.. ఈ ఎన్నికల కోసం ఈ ఏడాది జనవరి వరకు ప్రచురించిన ఓటర్ లిస్ట్‌ను పరిగణలోకి తీసుకుంటామని ఈసీ పేర్కొంది. ఈవీఎంల ద్వారానే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
తాజా ఉప ఎన్నికల్లోఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్‌ధామి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.. ఆయన చంపావత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి విజయం సాధించినా ధమ్ సింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా స్థానం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ఓడిపోయారు. అయిప్పటికీ బీజేపీ అధిష్టానం ఆయన్ని మరోసారి సీఎంగా చేసింది. కాగా పుష్కర్ సింగ్ తన పదవిని నిలబెట్టుకోవాలంటే అసెంబ్లీకి ఎన్నికల కావాలి.. ధామికి అవకాశం ఇచ్చేందుకు చంపావత్ బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ గెహ్టోడి గత నెలలో రాజీనామా చేశారు.