AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గోడకి ప్లాస్టరింగ్ ఇలా కూడా చేయొచ్చా బాబు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో ఫన్నీ వీడియోలని ప్రజలు ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తారు. లైక్స్‌, కామెంట్స్‌తో అలరిస్తారు. తాజాగా

Viral Video: గోడకి ప్లాస్టరింగ్ ఇలా కూడా చేయొచ్చా బాబు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!
Viral Video
uppula Raju
|

Updated on: May 02, 2022 | 11:10 AM

Share

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో ఫన్నీ వీడియోలని ప్రజలు ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తారు. లైక్స్‌, కామెంట్స్‌తో అలరిస్తారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. మీరు ఆ వీడియోని చూస్తే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. సాధారణంగా తాపీ మేస్త్రీలు ఇళ్లు కట్టడం, గోడలకు ప్లాస్టరింగ్ చేయడం చూసే ఉంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి గోడకి ఎలా ప్లాస్టరింగ్‌ చేస్తున్నాడో చూస్తే నవ్వుకుంటారు. ఇతడు ఉపయోగించే టెక్నిక్ చాలా ఫన్నీగా ఉంటుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక తాపీ మేస్త్రీ సిమెంట్‌ ద్రావణాన్ని గోడకి విసిరికొట్టడం మనం చూడవచ్చు. అతని లక్ష్యం బాగానే ఉంది కానీ అసలు విషయం ఏంటంటే దానిని ప్లాస్టరింగ్‌ చేయడానికి మళ్లీ మెట్ల లాంటివి ఏర్పాటు చేయక తప్పదు. అయినప్పటికీ అతడు సిమెంట్‌ ద్రావణం విసిరికొట్టే పద్దతి చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. సాధారణంగా ఈ పనిలో ఇద్దరు, ముగ్గురు అవసరం అయితే ఇక్కడ ఒక్కరే పనిచేయడం మనం గమనించవచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫన్నీ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాకుండా తెగ నవ్వుకుంటున్నారు. ‘వీడేంట్రా బాబు ఇలా చేస్తున్నాడు’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ వీడియోని ఒక నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిఫుల్‌గ్రామ్ అనే ఐడితో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకి 1 లక్ష 66 వేల వ్యూస్‌ వచ్చాయి. 3800 మందికి పైగా వీడియోను లైక్ చేసారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూస్తే మీ కామెంట్ తెలియజేయండి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vegetables: వేసవిలో ఈ 5 సీజనల్‌ కూరగాయలు కచ్చితంగా తినాలి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!

IPL 2022: రవీంద్ర జడేజా అర్థం చేసుకోలేదు.. కానీ ధోని అవకాశం ఇచ్చాడు.. ఇప్పుడతను ఒక సంచలనం..!

New Labour Code: జూలై 1 నుంచి పనిలో పెద్ద మార్పు.. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం..!