Ap10th Exams: పరీక్షా హాల్‌లో విరిగి పడ్డ ఫ్యాన్.. విద్యార్థినికి గాయం, కృష్ణాజిల్లాలో కాపీయింగ్ కలకలం..
Ap10th Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. షెడ్యూల్‌లో భాగంగా సోమవారం మ్యాథ్స్ పరీక్ష ముగిసింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. అనంతపురం పెనుకొండలోని విజ్ఞాన్ పాఠశాలలో..
Ap10th Exams: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. షెడ్యూల్‌లో భాగంగా సోమవారం మ్యాథ్స్ పరీక్ష ముగిసింది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. అనంతపురం పెనుకొండలోని విజ్ఞాన్ పాఠశాలలో పరీక్ష రాస్తోన్న ఓ విద్యార్థినిపై సీలింగ్ ఫ్యాన్ పడింది. స్పందన అనే విద్యార్థిని పరీక్ష రాస్తుండగా ఒక్కసారిగా ఫ్యాన్ కింద పడింది. దీంతో కంటి కింది భాగంలో గాయమై రక్తస్రావమైంది. వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. విద్యార్థినికి ఎలాంటి అపాయం లేదని వైద్యులు చెప్పడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థిని పరీక్షను పూర్తి చేసింది.
కృష్ణా జిల్లాల్లో కాపీయింగ్ కలకలం..
ఇదిలా ఉంటే కృష్ణా జిల్లా పామర్రు మండలం పసుమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. పరీక్షా కేంద్రానికి సమాధాన స్లిప్‌లను పంపుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో సమాచారం అందుకున్న వెంటనే విద్యాశాఖ, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. పలువురు ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌లలో పరీక్షా పత్రాలకు సంబంధించిన సమాధానాలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. డీఈఓ తాహిరా సుల్తానా పసుమర్రు చేరుకొని విచారిస్తున్నారు.
విచారణ జరుగుతున్న దృష్ట్యా మీడియాకు వివరాలు చెప్పేందుకు అధికారులు నిరాకరించారు. ఇక చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరగుతోన్న కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పూతలపట్టు మండలం పోలవరం జెడ్పీ హైస్కూల్లో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ హరి నారాయణన్ పరిశీలించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Telugu Movies: ఈవారం మరింత ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
US Firing: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. షికాగోలో వేర్వేరు ఘటనల్లో 8మంది మృతి, 42 మందికి గాయాలు!
Stock Market: నష్టాలతో నెల ప్రారంభించిన స్టాక్ మార్కెట్.. బేర్ పంజాతో సూచీల కుదేలు..