AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Orange Cap: ఆర్సీబీ గెలిచినా టాప్‌ 5లో చోటు సంపాదించని డుప్లెసిస్.. నెంబర్‌ వన్‌గా బట్లర్‌కి తిరుగులేదు..!

IPL 2022 Orange Cap: IPL- 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 13 పరుగుల తేడాతో గెలిచింది.

IPL 2022 Orange Cap: ఆర్సీబీ గెలిచినా టాప్‌ 5లో చోటు సంపాదించని డుప్లెసిస్.. నెంబర్‌ వన్‌గా బట్లర్‌కి తిరుగులేదు..!
Duplessis
uppula Raju
|

Updated on: May 05, 2022 | 1:17 PM

Share

IPL 2022 Orange Cap: IPL- 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 13 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఎనిమిది వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించి భారీ స్కోరుకు పునాది వేశారు. ఈ మ్యాచ్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో హార్దిక్ పాండ్యాను డు ప్లెసిస్ అధిగమించాడు. అయితే ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్-5కి చేరుకోలేకపోయాడు. చెన్నైపై డు ప్లెసిస్ 38 పరుగులు చేయడం వల్ల 11 మ్యాచ్‌ల్లో 316 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో డు ప్లెసిస్ ఇప్పటి వరకు రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అతను నంబర్-6ని ఆక్రమించాడు.

బెంగళూరు జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్ ఫామ్‌లో కనిపించలేదు. అయితే గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించి మళ్లీ ఫామ్‌లోకి రావాలని భావించాడు. చెన్నైపై కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 30 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 31వ స్థానానికి చేరుకున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 216 పరుగులు చేశాడు. మరోవైపు ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్-5 బ్యాట్స్ మెన్ జాబితా చెన్నై-బెంగళూరు మ్యాచ్ తర్వాత ఏ మాత్రం మారలేదు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ నంబర్-1లో కొనసాగుతున్నాడు. 10 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీల ఆధారంగా 588 పరుగులు చేశాడు.

మరోవైపు లక్నో సూపర్‌ జెయింట్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రాహుల్ 10 మ్యాచ్‌ల్లో 451 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. పంజాబ్ కింగ్స్‌కు చెందిన శిఖర్ ధావన్ 10 మ్యాచ్‌ల్లో 369 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ తొమ్మిది మ్యాచ్‌ల్లో 324 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 10 మ్యాచ్‌ల్లో 324 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Maruti Suzuki: 22 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కారు ఇప్పటికీ నెంబర్‌ వన్.. అమ్మకాలలో తగ్గని జోరు..!

Viral Video: ఈ పెళ్లికొడుకు డ్యాన్స్‌కి అందరు ఫిదా.. వీడియో చూస్తే ప్రశంసించకుండా ఉండలేరు..!

JIO: జియో 3 కొత్త ప్రీ పెయిడ్‌ ప్లాన్‌లు.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌.. ఇంకా చాలా..!

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!