JIO: జియో 3 కొత్త ప్రీ పెయిడ్‌ ప్లాన్‌లు.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌.. ఇంకా చాలా..!

JIO: రిలయన్స్ జియో తన సబ్‌స్క్రైబర్‌ల కోసం మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్‌ల ధర రూ. 333, రూ. 583 రూ. 783గా నిర్ణయించింది.

JIO: జియో 3 కొత్త ప్రీ పెయిడ్‌ ప్లాన్‌లు.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌.. ఇంకా చాలా..!
Jio
Follow us
uppula Raju

|

Updated on: May 05, 2022 | 12:08 PM

JIO: రిలయన్స్ జియో తన సబ్‌స్క్రైబర్‌ల కోసం మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్‌ల ధర రూ. 333, రూ. 583 రూ. 783గా నిర్ణయించింది. ఈ ప్లాన్లలో మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌ యాక్సెస్ అందిస్తుంది. వినియోగదారులు ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి అపరిమిత వాయిస్, డేటా, SMS, ఇతర ప్రయోజనాలను పొందుతారు. అంతేకాదు సినిమాలు, సిరీస్‌లు, లైవ్‌ క్రికెట్ మ్యాచ్‌లను చూడవచ్చు. వాస్తవానికి 3-నెలల డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ని పొందుతున్న వినియోగదారులు సర్వీస్‌లో స్ట్రీమింగ్‌ను కొనసాగించడానికి నిరంతరం యాక్టివ్ ప్లాన్‌లో ఉండాలి. ఈ కొత్త ఆఫర్‌ను పొందాలంటే కస్టమర్‌లు ముందుగా అర్హత కలిగిన ప్లాన్‌లలో ఒకదానితో రీఛార్జ్ చేసుకోవాలి. ఆ తర్వాత వారు రీఛార్జ్ చేసిన అదే జియో నంబర్‌తో డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌కి సైన్ ఇన్ చేయవచ్చు. ఈ నంబర్‌కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత సైన్-ఇన్ ప్రక్రియ పూర్తవుతుంది.

రూ. 333 జియో క్రికెట్ ప్లాన్

డిస్నీ+హాట్‌స్టార్ ఆఫర్‌ను పొందగలిగే చౌకైన ప్లాన్ రూ.333. ఇది 28 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు రోజుకు 1.5GB, అపరిమిత వాయిస్ కాల్‌లు రోజుకు 100 SMSలను పొందుతారు.

రిలయన్స్ జియో రూ. 583 ప్రీపెయిడ్ ప్లాన్

రూ. జియో నుంచి 583 ప్రీపెయిడ్ ప్లాన్ దాని సబ్‌స్క్రైబర్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 1.5GB డేటా, 56 రోజుల వ్యాలిడిటి, రోజుకు 100 SMSలను అందిస్తుంది. రూ. 583 ప్రీపెయిడ్ ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సర్వీస్‌కు మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.

రిలయన్స్ జియో రూ. 783 ప్రీపెయిడ్ ప్లాన్

మూడో ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 783 ఇది 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు, రోజుకు 1.5GB డేటా, మొత్తం 126GB డేటా, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఇతర అంశాలలో Jio యాప్‌ల కోసం కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్, Disney+ Hotstar మొబైల్ సర్వీస్‌కు మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Shigella Bacteria: షిగెల్లా బ్యాక్టిరియా ఎఫెక్ట్‌.. కేరళలో తొలి మరణం.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు..

IPL 2022: ఈ ఆర్సీబీ ప్లేయర్ చెన్నైని కోలుకోలేని దెబ్బతీశాడు.. ప్రత్యర్థి జట్లకి హెచ్చరికలు జారీ చేశాడు..!

PSC Exam Calendar 2023: యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2023 విడుదల.. IAS, NDAతో సహా పలు పరీక్ష తేదీలను తెలుసుకోండి..!