HUL News: సామాన్యులకు మరో షాక్.. మరోసారి సోపులు, షాంపుల రేట్లు 15 శాతం పెంచిన హిందుస్థాన్ సంస్థ..

HUL News: దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఎమ్సీజీ సంస్థ హిందుస్థాన్ యూనీలివర్(Hindustan Uniliver) తమ ఉత్పత్తుల ధరలను ఏకంగా 15 శాతం వరకు పెంచేసింది. వివరాల ప్రకారం క్లినిక్ ప్లస్, సన్ సిల్క్ షాంపూలు, పాండ్స్, లక్స్ సోప్ ధరలు పెరిగాయి.

HUL News: సామాన్యులకు మరో షాక్.. మరోసారి సోపులు, షాంపుల రేట్లు 15 శాతం పెంచిన హిందుస్థాన్ సంస్థ..
Hul Price Hike
Follow us

|

Updated on: May 05, 2022 | 2:21 PM

HUL News: దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఎమ్సీజీ సంస్థ హిందుస్థాన్ యూనీలివర్(Hindustan Uniliver) తమ ఉత్పత్తుల ధరలను ఏకంగా 15 శాతం వరకు పెంచేసింది. వివరాల ప్రకారం.. 125 గ్రా పియర్స్ సబ్బు ధర 2.4 శాతం నుంచి 3.7 శాతం వరకు పెరిగింది. అత్యంత ప్రాచుర్యం పొందిన లక్స్ సోప్(Lux Soap) రేటును 9 శాతం వరకు పెంచేసింది. వీటికి తోడు సన్ సిల్క్ బాటిల్ ధర 8 నుంచి 10 మేర పెరగగా, 100 మిగ్రా క్లినిక్ ప్లస్ షాంపు ధరలను 15 శాతం పెంచింది. సామాన్యుల నుంచి అందరూ అత్యంత ఎక్కువగా వినియోగించే గ్లో అండ్ లౌలీ రేట్లు 6 నుంచి 8 శాతం పెంచింది. పాండ్స్ పౌడర్ కూడా 5 నుంచి 7 శాతం వరకూ పెరగటంతో ఈ వస్తువులు ప్రియం కానున్నాయి. చివరిసారిగా హిందుస్థా్న్ యూనిలివర్ తన ఉత్పత్తుల ధరలను చివరిగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో పెంచింది.

కంపెనీ చర్మ సౌందర్య సాధనాలు, డిటర్జెంట్లపై 3 నుంచి 20 శాతం వరకు తమ ఉత్పత్తులను కంపెనీ పెంచింది. ప్రస్తుతం దేశంలో ఉన్న ద్రవ్యోల్బణ పరిస్థితులను గత 30 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని కంపెనీ సీఈవో, ఎండీ సంజీవ్ మెహతా వెల్లడించారు. రానున్న కాలంలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలు ఉన్నట్లు ఆయన అంచనావేస్తున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని కంపెనీలు సిద్ధంగా ఉండాలని ఆయన అంటున్నారు. ప్రస్తుతం తరుణంలో తాజాగా రిజర్వు బ్యాంక్ తన వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్ల మేర పెంచటం పరిస్థితులకు అద్దం పడుతోంది. గత రెండేళ్ల కాలంలో వడ్డీ రేట్లను 4.40 శాతానికి ఆర్బీఐ పెంచటం ఇదే తొలిసారి.

ఇవీ చదవండి..

Maruti Suzuki: 22 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కారు ఇప్పటికీ నెంబర్‌ వన్.. అమ్మకాలలో తగ్గని జోరు..!

JIO: జియో 3 కొత్త ప్రీ పెయిడ్‌ ప్లాన్‌లు.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌.. ఇంకా చాలా..!

Latest Articles