Multibagger Stock: రెండేళ్లలో లక్ష పెట్టుబడిని.. రూ.50 లక్షలుగా మార్చిన టాటా గ్రూప్ స్టాక్..

Multibagger Stock: స్టాక్ మార్కెట్ లో అందరికీ పెట్టుబడి పెట్టాలి వాటి నుంచి అధిక లాభాలు పొందాలని అనుకుంటుంటారు. కానీ అందరూ ఎక్కువగా తక్కువ ధరకు లభించే పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటారు.

Multibagger Stock: రెండేళ్లలో లక్ష పెట్టుబడిని.. రూ.50 లక్షలుగా మార్చిన టాటా గ్రూప్ స్టాక్..
Stock market
Follow us

|

Updated on: May 05, 2022 | 3:05 PM

Multibagger Stock: స్టాక్ మార్కెట్ లో అందరికీ పెట్టుబడి పెట్టాలి వాటి నుంచి అధిక లాభాలు పొందాలని అనుకుంటుంటారు. కానీ అందరూ ఎక్కువగా తక్కువ ధరకు లభించే పెన్నీ స్టాక్స్(Penny Stocks) లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటారు. మార్కెట్లో అనుభవజ్ఞులు ఎప్పుడూ పెన్ని స్టాక్ చాలా రిస్క్ అయినవి వాటికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. కానీ ఆ రిస్క్ ను కాస్త తట్టుకొని మార్కెట్ ను స్టడీ చేస్తే పెన్నీ స్టాక్స్ కూడా సిరులు కురిపిస్తుంటాయి. అలాంటి కోవకు చెందినదే ఈ టాటా గ్రూప్ కు చెందినదే ఈ స్టాక్.

టాటాలకు చెందిన టాటా టెలిసర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్(TTML) తన ఇన్వెస్టర్లకు కేవలం రెండేళ్ల కాలంలో ఊహించని లాభాలను ఆర్జించిపెట్టింది. పెట్టుబడి విలువను ఏకంగా 50 రెట్లు చేసింది. అంటే ఈ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే.. ఇప్పుడు దాని విలువ ఏకంగా 50 లక్షలకు చేరింది. ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ధర రెండు సంవత్సరాల కాలంలో రూ.2.50 నుంచి రూ.126కు పెరిగింది. ఈ సమయంలో సుమారు 4900 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ స్టాక్ సంవత్సరం ప్రారంభం నుంచి కన్సాలిడేట్ అవుతోంది. ఈ కాలంలో కంపెనీ షేర్ విలువ రూ.195 నుంచి రూ.126కు పడిపోయింది. అంటే 35 శాతం మేర షేర్ విలువ పతనమైంది. ఈ షేర్ ఏప్రిల్ లో తన 52 వారాల గరిష్ఠమైన రూ.210.40ను తాకింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో రూ.130.40 వద్ద ట్రేడవుతోంది.

గత 6 నెలల్లో ఈ పెన్నీ స్టాక్ ధర రూ.67 నుంచి రూ.126కి పెరిగి సుమారు రెండితలైంది. ఈ కాలంలో దాదాపు 80 శాతం లాభాన్ని ఇచ్చింది.  అదేవిధంగా గత ఏడాదిలో TTML షేర్ ధర రూ.12.75 నుంచి రూ.126కి పెరిగింది. 2020 ఏప్రిల్ లో రూ.2.50 వద్ద ఉన్న ఈ షేర్ విలువ తాజాగా రూ.126కు చేరుకుంది. అంటే  ఈ రెండేళ్ల కాలంలో రేటు 50 రెట్లు పెరిగింది. నెలకిందట దీనిలో లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ.65 వేలకు పడిపోయేది. అదే ఆరు నెలల కిందట లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.1.80 గా ఉండేది. అదే విధంగా ఏడాది కిందట లక్ష పెట్టుబడి పెడితే దాని విలువ రూ.9.50 లక్షలుగా ఉండేది. ఇన్వెస్టర్ ఈ షేర్ లో రెండేళ్లకిందట లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.50 లక్షలుగా ఉండేది. దీర్ఘకాలం కోసం ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి షేర్ ఊహించని లాభాలను అందించింది.

ఇవి కూడా చదవండి

NOTE: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

HUL News: సామాన్యులకు మరో షాక్.. మరోసారి సోపులు, షాంపుల రేట్లు 15 శాతం పెంచిన హిందుస్థాన్ సంస్థ..

Maruti Suzuki: 22 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కారు ఇప్పటికీ నెంబర్‌ వన్.. అమ్మకాలలో తగ్గని జోరు..!

Latest Articles
గ్రేటర్ హైదరాబాద్‎లో నీటి కొరత.. వీటికి పెరుగుతున్న ఫుల్ డిమాండ్.
గ్రేటర్ హైదరాబాద్‎లో నీటి కొరత.. వీటికి పెరుగుతున్న ఫుల్ డిమాండ్.
ఉన్నట్టుండి గాల్లో తేలియాడిన బాలిక..ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి
ఉన్నట్టుండి గాల్లో తేలియాడిన బాలిక..ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి
ఎక్కడ విన్నా పుష్పరాజ్‌ పాటే..అసల తగ్గేదేలే
ఎక్కడ విన్నా పుష్పరాజ్‌ పాటే..అసల తగ్గేదేలే
RRతో మ్యాచ్.. టాస్ గెలిచిన SRH.. జట్టులోకి మరో డేంజరస్ ప్లేయర్
RRతో మ్యాచ్.. టాస్ గెలిచిన SRH.. జట్టులోకి మరో డేంజరస్ ప్లేయర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల..
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
నయా రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..
నయా రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..
రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం
రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు దుర్మరణం
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ