AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interest Rate Hike: బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్లను పెంచిన ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఎంత మేర అంటే..

Interest Rate Hike: అకస్మాత్తుగా నిన్న రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను పెంచడంతో.. ఇప్పుడు బ్యాంకులు సైతం తమ వడ్డీ రేట్లను పెంచటం ప్రారంభించాయి.

Interest Rate Hike: బ్యాడ్ న్యూస్.. వడ్డీ రేట్లను పెంచిన ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా.. ఎంత మేర అంటే..
Banks Interesr Rates
Ayyappa Mamidi
|

Updated on: May 05, 2022 | 3:38 PM

Share

Interest Rate Hike: అకస్మాత్తుగా నిన్న రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను పెంచడంతో.. ఇప్పుడు బ్యాంకులు సైతం తమ వడ్డీ రేట్లను పెంచటం ప్రారంభించాయి. దేశంలోని దిగ్గజ బ్యాంకులు వరుసబెట్టి వడ్డీ రేట్ల పెంపుపై ప్రకటనలు చేస్తున్నాయి. ప్రైవేట్ రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐతో(ICICI Bank) పాటు, ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకు ఆఫ్ బరోడా(Bank Of Baroda) లెండింగ్ రేట్లను పెంచుతున్నట్లు ఈ రోజు ప్రకటించాయి. దీనివల్ల హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు పెరగనున్నాయి. గృహరుణాల చెల్లింపులు కూడా ఖరీదుకానున్నాయి. ఎందుకంటే ఈ రుణాలు రెపో రేటుతో లింక్ అయి ఉంటాయి కాబట్టి. రానున్న మరికొన్ని రోజులు మిగిలిన బ్యాంకులు సైతం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు రేట్లను పెంచుతాయని తెలుస్తోంది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని అందుపు చేసేందుకు రానున్న కాలంలో వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయని రిజర్వు బ్యాంక్ తాజా పెంపుతో సంకేతాలు ఇచ్చింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లోన్ వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకులలో ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడాలున్నాయి.

ఐసీఐసీఐ రెట్ల పెంపు..

ఆర్‌బీఐ రెపో రేటు పెంపు తర్వాత ప్రైవేటు బ్యాంకిగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన వెబ్‌సైట్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆర్‌బీఐ పాలసీ రెపో రేటుతో లింకైన ఐసీఐసీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు(I-EBLR) మే 4, 2022 నుంచి వార్షికంగా 8.10 శాతంగా అమల్లోకి వస్తుందని తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు ఈ రేటును ఆర్‌బీఐ రేటు పెంపుకు అనుగుణంగా 40 బేసిస్ పాయింట్లను మాత్రమే పెంచింది.

ఇవి కూడా చదవండి

బ్యాంకు ఆఫ్ బరోడా రేట్ల పెంపు..

మే 5, 2022 నుంచి రెపోతో లింకైన బరోడా లెండింగ్ రేటు(బీఆర్‌ఎల్ఎల్‌ఆర్) రిటైల్ లోన్లపై 6.90 శాతంగా ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. ఈ రేటుని బ్యాంకు ఆఫ్ బరోడా కూడా 40 బేసిస్ పాయింట్ల మేరకు మాత్రమే పెంచింది. త్వరలోనే మరిన్ని బ్యాంకులు ఈ ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. 40 బేసిస్ పాయింట్ల రెపో రేటు పెంపు అనేది ప్రస్తుతం లోన్స్ తీసుకున్నవారికి, కొత్తగా లోన్లు తీసుకునే వారికి వడ్డీ భారాన్ని పెంచనుంది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్ అంటే రెపో రేటుతో లింకైన హోమ్ లోన్లు, ఇతర అన్ని రుణాలపై తాజా రేట్ల పెంపు ప్రభావం ఉంటుందని అర్థం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Multibagger Stock: రెండేళ్లలో లక్ష పెట్టుబడిని.. రూ.50 లక్షలుగా మార్చిన టాటా గ్రూప్ స్టాక్..

HUL News: సామాన్యులకు మరో షాక్.. మరోసారి సోపులు, షాంపుల రేట్లు 15 శాతం పెంచిన హిందుస్థాన్ సంస్థ..