IPL 2022: ఈ ఆర్సీబీ ప్లేయర్ చెన్నైని కోలుకోలేని దెబ్బతీశాడు.. ప్రత్యర్థి జట్లకి హెచ్చరికలు జారీ చేశాడు..!

IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్‌ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రెండు జట్లు నిన్న మరోసారి తలపడ్డాయి.

IPL 2022: ఈ ఆర్సీబీ ప్లేయర్ చెన్నైని కోలుకోలేని దెబ్బతీశాడు.. ప్రత్యర్థి జట్లకి హెచ్చరికలు జారీ చేశాడు..!
Harshal Patel
Follow us

|

Updated on: May 05, 2022 | 11:00 AM

IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మ్యాచ్‌ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రెండు జట్లు నిన్న మరోసారి తలపడ్డాయి. ఐపీఎల్ -2022లో ఈ రెండు జట్లు తలపడడం ఇది రెండోసారి. తొలి మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. అయితే బెంగుళూరు విజయంలో యువ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. ఈ బౌలర్ నాలుగు ఓవర్లలో 35 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. అతను ఈ మూడు వికెట్లను కూడా చాలా ప్రత్యేకంగా తీసుకున్నాడు. ఈ ప్రదర్శన కారణంగా హర్షల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

స్లో బంతుల్లోనే హర్షల్ మూడు వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా రూపంలో హర్షల్ తొలి వికెట్ తీశాడు. గంటకు 127 కిలోమీటర్ల వేగంతో పటేల్ ఈ బంతిని విసిరాడు. తర్వాత మొయిన్ అలీ రెండో బాధితుడయ్యాడు. తర్వాత మూడో బంతికి డ్వేన్ ప్రిటోరియస్‌న్ ఔట్‌ అయ్యాడు. పటేల్ స్లో డెలివరీలో ప్రిటోరియస్ కూడా అవుటయ్యాడు. ఈ బంతిని గంటకు 129 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తర్వాత హర్షల్ మాట్లాడుతూ.. “బ్యాట్స్‌మెన్ స్లో బంతుల కోసం వేచిచూసేటప్పుడు నేను అలాంటి బంతులను అస్సలు వేయను. ఆ సమయంలో హార్డ్ లెంగ్త్‌లు, బౌన్సర్లు, యార్కర్లను విసురుతాను. కానీ ఈ సీజన్‌లో యార్కర్లను ఎక్కువగా ఉపయోగించలేకపోయాను. అయితే ఐపీఎల్ ద్వితీయార్థంలో వీటిని ప్రయోగించడానికి ప్రయత్నిస్తాను” అన్నాడు.

ప్లే ఆఫ్ రేసు నుంచి CSK ఔట్!

చెన్నై జట్టు ప్లే ఆఫ్‌కు చేరడం అసాధ్యమని లెక్కలు చెబుతున్నాయి. ఎందుకంటే పాయింట్ల పట్టికలో చెన్నై 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. టోర్నమెంట్లో ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 4 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే రన్ రేట్ 14 ప్లస్‌లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటికీ రాజస్థాన్‌ రాయల్స్, రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు 12 పాయింట్లతో 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. వీటితో పోల్చుకుంటే చెన్నై దాదాపు వెనుకంజలో ఉంది. ప్లే ఆఫ్ చేరుకోవడం దాదాపు అసాధ్యమే. RCB చేతిలో ఓడిపోయిన తర్వాత CSK ప్లే-ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినట్లు ధోని మాటలని బట్టి అర్థమవుతుంది.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

UPSC Exam Calendar 2023: యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2023 విడుదల.. IAS, NDAతో సహా పలు పరీక్ష తేదీలను తెలుసుకోండి..!

Knowledge: కుక్కలు పిల్లులని ఇష్టపడకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

IPL 2022: ముంబై ఇండియన్స్‌కి షాక్.. వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్‌కి నో ఎంట్రీ..!

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..