Telugu News » Photo gallery » Why do dogs dislike cats so much know the reason behind it all details
Knowledge: కుక్కలు పిల్లులని ఇష్టపడకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
Knowledge: కుక్క, పిల్లి రెండు పెంపుడు జంతువులు. కానీ వీటి మధ్య స్నేహం ఉండదు. చాలా సందర్భాలలో కుక్కలు పిల్లులని చూసినప్పుడు కోపంతో వాటి వెనుక పరుగెత్తుతాయి.
కుక్క, పిల్లి రెండు పెంపుడు జంతువులు. కానీ వీటి మధ్య స్నేహం ఉండదు. చాలా సందర్భాలలో కుక్కలు పిల్లులని చూసినప్పుడు కోపంతో వాటి వెనుక పరుగెత్తుతాయి. వీరిద్దరి మధ్య ఈ శత్రుత్వం ఎందుకు ఉందో అర్థం చేసుకునేందుకు సైంటిస్టులు ప్రయత్నించారు. దీనికి కారణం పిల్లులు కుక్కలని అంతగా ఇష్టపడవని తేలింది.
1 / 5
ఈ రెండు జంతువులు ఒకరినొకరు ఇష్టపడకపోవడానికి కారణం వారి స్వభావమే. కుక్క సమూహంలో ఉండటానికి ఇష్టపడుతుంది. పిల్లి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. అంతేకాదు పిల్లులను ఎప్పుడూ వెంట తీసుకెళ్లదు.
2 / 5
వాస్తవానికి కుక్క.. పిల్లిని మొదటిసారి చూసినప్పుడు స్నేహం చేయాలని ప్రయత్నిస్తుంది. నెమ్మదిగా పిల్లి దగ్గరికి వచ్చి దాని శరీర వాసన చూడటానికి ప్రయత్నిస్తుంది. ఇలా చేయడం పిల్లికి అస్సలు నచ్చదు. కుక్కలు తోక ఊపడం ద్వారా తన స్నేహం గురించి వ్యక్తం చేస్తాయి. కానీ పిల్లులకి తోక ఊపడం అంటే కోపం తెచ్చుకోవడం అని అర్థం.
3 / 5
ఇలా రెండిటి స్వభావం కారణంగా ఒకరంటే ఒకరికి పడదు. కుక్క స్నేహం కోసం పిల్లి వద్దకు వచ్చినప్పుడు అది దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది.
4 / 5
కానీ రెండు ఒకే ఇంట్లో పెరిగినప్పుడు వీటి మధ్య స్నేహం చిగురిస్తుంది. ఇది చాలా సందర్భాల్లో నిరూపణ అయింది.