AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ముంబై ఇండియన్స్‌కి షాక్.. వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్‌కి నో ఎంట్రీ..!

IPL 2022: ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టు. కానీ IPL- 2022 లో చాలా ఘోరంగా విఫలమైంది.

IPL 2022: ముంబై ఇండియన్స్‌కి షాక్.. వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్‌కి నో ఎంట్రీ..!
Mumbai Indians
uppula Raju
|

Updated on: May 05, 2022 | 9:12 AM

Share

IPL 2022: ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టు. కానీ IPL- 2022 లో చాలా ఘోరంగా విఫలమైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టు వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇలా ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఫలితంగా ముంబై జట్టు ఈ సీజన్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో ముంబై స్థానాన్ని పరిశీలిస్తే తొమ్మిది మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్‌ మాత్రమే గెలిచి కేవలం రెండు పాయింట్లను సాధించింది. ఈ సీజన్‌లో ముంబై మాత్రమే చాలా తక్కువ పాయింట్లతో టోర్నోలో చివరి స్థానంలో నిలిచింది.

IPL-2022లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. దీంతో ముంబైకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెంగళూరు ఇప్పుడు 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లు, లక్నో సూపర్ జెయింట్ 14 పాయింట్లతో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు జట్లకు 12 పాయింట్లు ఉన్నాయి. ఈ రెండు జట్లతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు10 పాయింట్లతో కొనసాగుతున్నాయి.

అన్ని మ్యాచ్‌లు గెలిచిన నో ఎంట్రీ..

ముంబై ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా అన్నిటిలో గెలిచినా 12 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. ఈ పరిస్థితిలో ప్లే ఆఫ్స్ చేరుకోవడానికి అవసరమైన పాయింట్లను కలిగి ఉండదు. 10 జట్లతో కూడిన ఈ ఐపీఎల్‌లో ప్లేఆఫ్ కటాఫ్ బహుశా 16 పాయింట్లతో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముంబై ప్లే ఆఫ్ చేరుకోవడం సాధ్యం కాదు. కొన్ని జట్లు 14 పాయింట్లతో అర్హత సాధించవచ్చు కానీ దీనికి నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండాలి. ప్రస్తుతం, ముంబై నెట్ రన్ రేట్ -0.836గా ఉంది. దీనిని మెరుగుపరచడం సాధ్యం కాదు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022: చెన్నై ప్లే ఆఫ్‌కి చేరుకుంటుందా.. టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించినట్లేనా..!

Cricket News: 55 బంతుల్లో 107 పరుగులు.. సెంచరీతో వీర విహారం చేసిన శ్రీలంక ప్లేయర్..!

IPL 2022: మైదానంలో ప్రేమకథ.. ఆర్సీబీ అభిమానికి ప్రపోజ్‌ చేసిన అమ్మాయి..!