Cricket News: 55 బంతుల్లో 107 పరుగులు.. సెంచరీతో వీర విహారం చేసిన శ్రీలంక ప్లేయర్..!
Cricket News: మే 4 సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్ బెంగుళూర్ మధ్య ఉత్కంఠ మ్యాచ్ జరుగుతుండగా మరోవైపు దుబాయ్
Cricket News: మే 4 సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్ బెంగుళూర్ మధ్య ఉత్కంఠ మ్యాచ్ జరుగుతుండగా మరోవైపు దుబాయ్ నుంచి మరో ప్లేయర్ పేరు వినిపించింది. ఇక్కడ ఫెయిర్‌బ్రేక్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. అందులో భాగంగా మొదటి మ్యాచ్ వారియర్స్, ఫాల్కన్స్ మహిళల మధ్య జరిగింది. ఇందులో 32 ఏళ్ల శ్రీలంక ప్లేయర్ చమీర ఆటపట్టు మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆరంభ మ్యాచ్‌తోనే అందరి దృష్టి తనవైపునకు మరల్చుకుంది. వాస్తవానికి న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు అర్హత సాధించనందున ఆమె పేరు ఎక్కడా వినిపించలేదు. దీంతో ఫెయిర్‌బ్రేక్ ఇన్విటేషనల్ టోర్నమెంట్‌ని వేదికగా చేసుకొని ఇప్పుడు తన సత్తాని చాటుతోంది. ఈమె ఫాల్కన్స్ మహిళల జట్టు తరపున ఆడుతోంది.
6 జట్ల పాల్గొనే ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ వారియర్స్ మహిళలు, ఫాల్కన్స్ మహిళల మధ్య జరిగింది. వారియర్స్ ఉమెన్ ఫాల్కన్స్ ఉమెన్స్‌కి 178 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇది అంత సులభమైన లక్ష్యం కాదు. కానీ చమీర 107 పరుగులు చేసి ఫాల్కన్స్‌ని విజయతీరాలకు చేర్చింది. ఈ ఎడమచేతి ప్లేయర్ 55 బంతుల్లో 107 పరుగులు చేసి వారియర్స్ జట్టులోని ఆరుగురు బౌలర్లని చితక్కొట్టింది. ఈ హోరాహోరీ సెంచరీలో కేవలం 18 బంతుల్లోనే 82 పరుగులు కొల్లగొట్టింది. అంటే బౌండరీల ద్వారా ఈ స్కోరు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
గత 9 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఆమె చివరి 9 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ సగటు 82గా ఉంది. ఈ 9 ఇన్నింగ్స్‌ల్లో 7 టీ20, 2 వన్డే ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు చేసింది. చమీరా అట్టపట్టు ఇప్పుడు దుబాయ్ పిచ్‌పై ఆడి వార్తల్లో నిలిచింది. దీనివల్ల ఫెయిర్‌బ్రేక్ ఇన్విటేషనల్ టోర్నమెంట్‌కి కూడా అందరికి తెలుస్తుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి